Tirupati-Shirdi Train: తిరుపతి మీదుగా షిర్డీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో భక్తుల నుంచి ఉన్న అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ పడింది. రోజూ తిరుపతి షిర్డీ మధ్య ట్రైన్ నడపాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్ర రైల్వే శాఖ ఓకే చెప్పంది. దీంతో త్వరలోనే ఈ ఈ రెండు స్టేషన్‌ల మధ్య ప్రతి రోజూ ట్రైన్ నడవబోతోంది. తిరుపతి షిర్డీ మధ్య ప్రస్తుతం 07637/07638 నెంబర్ ఉన్న ట్రైన్ నడుస్తోంది. ఇది కేవలం ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని ప్రతి రోజూ నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ ట్రైన్ ప్రతి రోజూ భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ ట్రైన్ అన్ని రోజుల పాటు నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు లేఖపై స్పందించిన రైల్వే శాఖ తిరుపతి షిర్డీ మధ్య ప్రతిరోజూ ట్రైన్ నడిపేందుకు అంగీకరిస్తూ ప్రతి లేఖ రాసింది.
తిరుపతి నుంచి షిర్డీ మధ్య సుమారు 1074 కిలోమీటర్ల రైల్వే దూరం ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాలను కలుపుతూ నడుస్తున్న రైళ్లు దాదాపు 1369 నుంచి 1439 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాల మధ్య మూడు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వారానికి ఒకటి లేదా రెండు రోజులు నడుస్తాయి. వాటిలో ప్రధానమైంది 1. TPTY SNSI స్పెషల్ ఫేర్ సమ్మర్ స్పెషల్ (07637) ఇది తిరుపతి (TPTY)లో ప్రారంభమై సాయినగర్ షిర్డీ (SNSI) వరకు నడుస్తుంది. ఇందులో ప్రయాణ సమయం సుమారు 29 గంటల 15 నిమిషాలు. ఇప్పుడు కేవలం ఆదివారం మాత్రమే అందుబాటులో ఉంది. ఇది త్వరలోనే అన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. తిరుపతి లో ఉదయం 05:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు షిర్డీ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం చేయాలంటే సుమారు ₹780, 3A కోచ్ కోసం ₹2000, 2A కోచ్ కోసం ₹3000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 31 స్టాప్‌లలో ఆగుతుంది. రేణిగుంట, కడప, గుంతకల్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఔరంగాబాద్ మొదలైనవి స్టేషన్లు ఉన్నాయి.
17417 నెంబర్ గల TPTY SNSI వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఇది తిరుపతి- షిర్డీ మధ్య కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. తిరుపతిలో ఉదయం 8:15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా రేణిగుంట, కడప, గుంతకల్, సికింద్రాబాద్, ఔరంగాబాద్, మన్మాడ్ మొదలైనవి 32 స్టేషన్‌లలో ఆగుతుంది.
16733నెంబర్‌తో ఉన్న RMM OKHA ఎక్స్‌ప్రెస్ కూడా అందుబాటులో ఉంది. ఇది రామేశ్వరం నుంచి ఓఖా వరకు నడుస్తుంది, కానీ తిరుపతి (TPTY) నుంచి నాగర్‌సోల్ (NSL) వరకు సేవలను అందిస్తుంది. ఇది షిర్డీకి సమీపంలో ఉంది. ఈ ట్రైన శనివారం మాత్రమే నడుస్తోంది. తిరుపతిలో మధ్యాహ్నం 12:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:38 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. నాగర్‌సోల్ నుంచి షిర్డీకి 40 కిలోమీటర్ల దూరాన్ని బస్సు లేదా టాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు