Andhra Pradesh Latest News: యూరియా సమస్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయాలను షేక్ చేస్తోంది. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తుంటే కావాల్సినంత స్టాక్ ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరికొన్ని వేల మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉందని తెలియజేస్తోంది. సమస్యలు లేకుండా రైతులకు అందజేయాలని సీం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రైతుల అవసరం మేరకు 17, 293 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపించింది. కేంద్రం పంపించిన యూరియా ప్రస్తుతం కాకినాడ పోర్టులో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కాకినాడ పోర్టు నుంచి యూరియాను జిల్లాలకు చేరవేయడం అక్కడి నుంచి రైతులకు చేరే వరకు చర్యలు చేపట్టాలని సూచించారు. 

రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరతే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతుకు యూరియా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా స్టాక్ ఉందని అన్నారు. మరో పదిరోజుల్లో మరింత యూరియా రాబోతోందని అధికారులు తెలిపారు. యూరియా రైతులకు మాత్రమే చేరాలని, బ్లాక్ మార్కెట్‌పై కఠినంగా ఉండాలని సీఎం హెచ్చారించారు. ఇందులో ఎవరు ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Continues below advertisement

మరోవైపు రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లభించం లేదని, ఎరువులు దొరకడం లేదని ఆరోపిస్తూ వైసీపీ పోరుబాట పడుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు మంగళవారం అన్ని ఆర్డీవో కార్యాలయ ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు యూరియాను కూటమి నేతలు బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారని విమర్శిస్తోంది. ఎరువుల కొరత ద్వారానే రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితి తెలుసుకొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అన్నదాత పోరు పేరుతో ఉద్యమం చేస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుల మందుల అందజేత, సరైన గిట్టుబాటు ధర కల్పించడం, ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించేలా ఒత్తడి తీసుకొస్తున్నామని అంటున్నారు. సమస్య గురించి బయటకు చెప్పుకోకుండా కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే రైతులు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు రైతులకు అండగా నిలబడేందుకు పోరుబాట పడుతున్నామని అంటున్నారు.