Rohini Karte 2023: 2023లో రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8 వరకూ ఉంటుంది. దాదాపు 15 రోజుల పాటూ ఎండలు మండిపోనున్నాయి. నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి ఉగాది నుంతి వేసవితాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. రోహిణి కార్తె 15 రోజుల్లో సూర్యుడి తీవ్రత పీక్స్ కి చేరి ఆ తర్వాత నుంచి మళ్లీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది.
కార్తెలు అంటే ఏంటి
జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా పంచాంగాలు తయారు చేశారు. జాతకాలు నిర్ణయిస్తారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. రైతుల లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి రోహిణి కార్తె.
Also Read: మీ అరచేతిలో పంచభూతాలున్నాయి గమనించారా!
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు
నాలుగు నెలల ఎండాకాలంలో ఉగాది నుంచి వేసవి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. అన్ని కార్తెల కన్నా రోహిణి కార్తె అంటే బంబేలెత్తిపోతారు. ఈ కార్తెలో ఎండలు మండిపోతాయని చెప్పడానికి బదులు రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు.అంటే వేడి తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందో అని చెప్పడమే దీని ఉద్దేశం.ఈ ఏడాది మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకూ ఉంటుంది.
27 నక్షత్రాలే 27 కార్తెలు
1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పూర్వాభాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి
ఏరువాక ప్రారంభం
వానలు సరైన సమయంలో పడితే రోహిణి కార్తెలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. రోళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసి రోహిణి కార్తెతో ఎండాకాలం అంతమైపోతుంది. దీని తరువాత ఒక్కో కార్తె వస్తూ ఉంటాయి. ఇలా వ్యవసాయ దారాలు ఒక్కో కార్తెలో ఒక్కో రకమైన వ్యవసాయ పనులు చేస్తుంటారు.
Also Read: అమ్మో అమ్మవారి పాదాలకింద శివుడు, అప్పటికి కానీ ఆమె శాంతించలేదు
ఈ 15 రోజులు జాగ్రత్త
ఎండలు మండే రోహిణి కార్తెలో పశువులు, పక్షులకు తాగేందుకు ఎక్కడిక్కకడ నీళ్లతొట్టెలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీరు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు..కనీసం మీ ఇంటి చుట్టుపక్కలైనా మూగజీవాలకు నీళ్లు అందించండి. ఇదేసమయంలో గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం ఇవ్వడంతో పాటూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకున్న గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు.