New Parliament Opening Ceremony: 


వెళ్లేదే లేదు: విపక్షాలు 


ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే...ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకూ ఆహ్వానాలు అందాయి. కానీ విపక్షాలు మాత్రం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే కొన్ని ప్రధాన పార్టీలు "వెళ్లేదే లేదు" అని తేల్చి చెప్పాయి. AAP,TMCతో పాటు వామపక్షాలు అధికారికంగా ప్రకటించాయి కూడా. ఆ తరవాత థాక్రే శివసేన తరపునా ప్రకటన వచ్చింది. సీనియర్ నేత సంజయ్ రౌత్..."అందరితో పాటూ మేము" అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలూ బైకాట్ చేయనున్నాయి. ఇదంతా ఎందుకు అంటే...కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది గవర్నర్ కానీ...ప్రధాని కాదు అని వాదిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. RJD ఈ వివాదంపై కీలక ట్వీట్ చేసింది. "రాష్ట్రీయ జనతా దళ్ (RJD) కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా బైకాట్ చేస్తున్నాం" అని వెల్లడించింది. అటు సంజయ్ రౌత్ "అన్ని ప్రతిపక్ష పార్టీలూ బైకాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. మేం కూడా అదే బాటలో నడుస్తాం" అని స్ఫష్టం చేశారు. అటు జేడీయూ (JDU) కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. జేడీయూ ప్రతినిధి ఒకరు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా మండి పడ్డారు. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిన హక్కు ప్రధానికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 


"అసలు కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాల్సిన అవసరమేముంది..? మన ముందు తరాల వారిని గౌరవించాలన్న కనీస మర్యాద కూడా లేదా..? అనవసరంగా డబ్బులు వృథా చేశారు. దేశంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత ఉన్న సమయంలో ఇలాంటి నిర్మాణాలు ఎందుకు...." 


- జేడీయూ ప్రతినిధి 










ఇక సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని డిసైడ్ అయ్యారు. దక్షిణాది విషయానికొస్తే...తమిళనాడులోని DMK పార్టీ తామూ రావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ఎన్‌సీపీ ప్రతినిధి ఇదే విషయం వెల్లడించారు. ఇక BRS పార్టీ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కొందరు ఎంపీలు ఇదే విషయాన్ని చెప్పారు. "అంతా నేనే" అని ప్రధాని ప్రచారం చేసుకునే ఆ కార్యక్రమానికి తాము వెళ్లాల్సిన అవసరం లేదని TMC స్పష్టం చేసింది. సీపీఐ జాతీయ సెక్రటరీ డీ రాజా ఇదే ప్రకటించారు. మే 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. 


Also Read: New Parliament: సనాతన ధర్మం ఉట్టిపడేలా కొత్త పార్లమెంట్‌,ప్రతిదీ వాస్తు ప్రకారమే