నేడు కవ్వూరులో సీఎం పర్యటన 


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఇవాళ పర్యటించనున్నారు. సీఎం పర్యటన కారణంగా కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపుగా రాకపోకల విషయంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం కొవ్వూరు రానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కే.మాధవీలత సభా ప్రాంగణం వద్ద భద్రతా ఏర్పాట్లును జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు 2.1 కిలోమీటర్లు వరకు ముఖ్యమంత్రి రోడ్‌షో లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి భద్రతా ఇబ్బందులు తలెత్తకుండా రూట్‌ మ్యాప్‌ పరిశీలించి ఆ రోడ్డు మార్గాన్ని కలెక్టర్‌, ఎస్పీ పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద కూడా మెడికల్‌ క్యాంపులు, తాగునీటి వసతి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


300 రూపాయల టికెట్లు విడుదల


జులై, ఆగస్టు నెలలో తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ ఇవాళ విడుదల చేయనుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్‌లను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. 25న తిరుపతిలో గదుల కోటా, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేస్తారు. 


ఐపీఎల్‌లో నేడు 


ఐపీఎల్‌లో ఇవాళ ఎలిమినేటర్‌లో ముంబయి ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ ఢీ కొనబోతున్నాయి. ఇప్పటి వరకు ముంబయితో ఆడిన మ్యాచ్‌లో  పై చేయి సాధించిన లక్నో అదే ఊపు కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే గత మ్యాచ్‌ల కసిని ఈ మ్యాచ్‌లో తీర్చుకొని లక్నోను ఇంటికి పంపించాలని చూస్తోంది ముంబయి. చెపాక్‌ స్టేడియంలో జరిగే ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుపు జెండా ఎగరేస్తారో చూడాలి. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అశోక్ లేలాండ్: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఆదాయం మార్చితో ముగిసిన త్రైమాసికంలో పెరిగినప్పటికీ, నికర లాభం దాదాపు 17% (YoY) తగ్గి రూ. 751.41 కోట్లకు పరిమితమైంది.









సిర్మా SGS టెక్: రెండు ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు, ఒక దేశీయ ఫండ్ మంగళవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సిర్మా SGS టెక్నాలజీస్‌లో వాటాను కొనుగోలు చేశాయి.


వరుణ్ బెవరేజెస్: వరుణ్ బెవరేజెస్, తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా వరుణ్ బెవరేజెస్ సౌత్ ఆఫ్రికా (PTY) లిమిటెడ్‌ను జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభించింది.


మెట్రో బ్రాండ్స్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో మెట్రో బ్రాండ్స్ రూ. 68.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 544 కోట్ల ఆదాయం వచ్చింది.


బికాజీ ఫుడ్స్‌: జనవరి-మార్చి కాలంలో బికాజీ ఫుడ్ నికర లాభం 51% పెరిగి రూ. 37.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం 16% పెరిగి రూ. 462 కోట్లకు చేరుకుంది.


డిక్సన్ టెక్నాలజీస్: డిక్సన్ టెక్నాలజీస్ నాలుగో త్రైమాసికంలో రూ. 81 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 2,065 కోట్లుగా ఉంది.


JSW ఎనర్జీ: JSW ఎనర్జీ జనవరి-మార్చి కాలానికి 272 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 2,670 కోట్ల ఆదాయం ఆర్జించింది.


డిష్ టీవీ: అనిల్ కుమార్ దువా రాజీనామాతో, కంపెనీ ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మనోజ్ దోభాల్‌ను తదుపరి CEOగా నియమించాలని డిష్ టీవీ బోర్డు ప్రతిపాదించింది.


అమర రాజా బ్యాటరీస్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 139 కోట్లతో 41% వృద్ధిని సాధించింది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 2,429 కోట్లుగా ఉంది.


టాటా కెమికల్స్: ముకుందన్‌ను మరో ఐదేళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, CEOగా కొనసాగిస్తూ కంపెనీ బోర్డ్‌ నిర్ణయించింది. ఈ నియామకం నవంబర్ 26, 2023 నుంచి అమలులోకి వస్తుంది.


సెంచరీ టెక్స్‌టైల్స్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో జారీ చేసి రూ. 400 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపింది.