2025 జూన్ 4 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 4th 2025

Continues below advertisement


మేష రాశి (Aries) జూన్ 4, 2025


ఈ రోజు ఈ రాశివారికి పని ఒత్తిడి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం అనుకున్నవన్నీ పూర్తిచేస్తారు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబం నుంచి మీకు మద్దతు ఉంటుంది. 


వృషభ రాశి (Taurus) జూన్ 4, 2025


ఈ రోజంతా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారి సలహాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వొద్దు. మీ నిర్వహణా సామర్థ్యాలను మరోసారి పరిశీలించుకోవడం మంచిది. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 


మిథున రాశి (Gemini) జూన్ 4, 2025
 
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితంలో వివాదం ఉంటుంది. ఓ పనిపై ప్రయాణించాల్సి వస్తుంది. చాలా సమస్యలపై మానసికంగా పోరాడుతారు. కోపంగా స్పందించవద్దు. అధ్యయనాల్లో విద్యార్థులకు సమస్యలుంటాయి.


కర్కాటక రాశి (Cancer) జూన్ 4, 2025


ఈ రోజు  కొత్త రచనలపై చాలా ఆసక్తి పెంచుకుంటారు. ప్రభుత్వ అధికారులకు పదోన్నతి  ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో ఐక్యత వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. 


సింహ రాశి (Leo) జూన్ 4, 2025


ఈ రోజు ప్రభుత్వ సేవతో సంబంధం ఉన్నవారికి సమస్యలు ఉండవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు అవసరం.
 
కన్యా రాశి (Virgo) జూన్ 4, 2025
 
ఈ రోజు మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. మీ ప్రవర్తనలో మృదుత్వం, సౌమ్యతను ఉంచుకోండి. వ్యాపారుల సమస్యలు పరిష్కారం అవుతాయి.  అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు. ప్రియమైనవారితో సమయం గడుపుతారు.


తులా రాశి (Libra) జూన్ 4, 2025


ఈ రోజు మీ తప్పులను కవర్ చేయకుండా ఉండండి. చట్టపరమైన విషయాలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు.  రుణాలు ఇవ్వడం మానుకోండి. అబద్దం చెప్పి మరింత ఇరుక్కుపోతారు. పాదాల్లో వాపు ఉండవచ్చు.


వృశ్చిక రాశి (Scorpio) జూన్ 4, 2025


ఈ రాశివారు ఓ శుభవార్త వింటారు. అన్ని పనులు సమయానికి పూర్తవుతాయి.  విద్యార్థులు వారి అధ్యయనాలపై చాలా శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు మరియు ఆర్డర్లు పొందే బలమైన అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి.
 
ధనుస్సు రాశి (Sagittarius) జూన్ 4, 2025


మీరు శుభకార్యాలకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. కళకు ఆకర్షితులవుతారు. ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. ఆలోచనల్లో చపలత్వం ఉంటుంది 


మకర రాశి (Capricorn) జూన్ 4, 2025


ఈ రోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ లేదా ప్రమోషన్ కి అవకాశం ఉంది. పనిచేసే ప్రదేసంలో చిన్న చిన్న అడ్డంకులుంటాయి కానీ వాటిని అధిగమిస్తారు. మీ మనస్సు సృజనాత్మక రచనలలో నిమగ్నమై ఉంటుంది.
 
కుంభ రాశి (Aquarius) జూన్ 4, 2025


ఈ రోజు సహోద్యోగులతో వివాదానికి దిగొద్దు. కుటుంబ సభ్యులతోనూ తగాదాకు దూరంగా ఉండడం మంచిది. అనైతిక చర్యల నుంచి డబ్బు సంపాదించడానికి ప్రయత్నించవద్దు. సంభాషణ సమయంలో మాట తూలొద్దు. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇబ్బంది ఉండవచ్చు.


మీన రాశి (Pisces) జూన్ 4, 2025
 
ఈ రోజు మీకు శుభ ఫలితాలున్నాయి. కుటుంబానికి మంచి సమయం వెచ్చిస్తారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అనుకున్న పనులన్నీ ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో స్నేహాన్ని కొనసాగించండి. 


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.