IPL 2025 Award Winners : IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌తో సహా అన్ని అవార్డు గ్రహీతల పూర్తి జాబితా వెల్లడైంది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మెరిసే 'టాటా కర్వ్' కారు గిఫ్టుగా వచ్చింది.
ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్- పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ కృష్ణ
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ IPL 2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 759 పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. గుజరాత్‌కు చెందిన ఆటగాడికి కూడా పర్పుల్ క్యాప్ లభించింది. ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. సుదర్శన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు, దీనికి అతను రూ. 10 లక్షలు, ట్రోఫీని అందుకున్నాడు.
ఈసారి మెరిసిన ఇద్దరు సూర్యలు
అత్యంత విలువైన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ముంబైకి చెందిన సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో సూర్య 717 పరుగులు సాధించాడు. దీనికి అతనికి రూ. 10 లక్షలు, ట్రోఫీ లభించింది. అదే సమయంలో, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. సూర్యవంశీ 7 మ్యాచ్‌ల్లో 206.55 స్ట్రోమీ స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. IPL 2025లో సూర్యవంశీ అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. SRHకి చెందిన కమిండు మెండిస్ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్నాడు, దీనిని చూసి కావ్య మారన్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే అతనికి ఈ అవార్డు వరించింది.
పూర్తి అవార్డుల జాబితా ఇదే
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - సాయి సుదర్శన్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ - వైభవ్ సూర్యవంశీ (టాటా కర్వ్ కారుతోపాటు ట్రోఫీ)
- సూపర్ సిక్స్ ఆఫ్ ది టోర్నమెంట్ - నికోలస్ పూరన్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- రూప్ గో ఆఫ్ ది ఫోర్ సీజన్ - సాయి సుదర్శన్ (రూ. 10 లక్షల నగదుతోపాటుట్రోఫీ)
- గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అవార్డు - మహమ్మద్ సిరాజ్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- క్యాచ్ ఆఫ్ ది సీజన్ - కమిందు మెండిస్ (రూ. 10 లక్షల నగదుతోపాటుట్రోఫీ)
- ఫెయిర్ ప్లే అవార్డు - చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- పర్పుల్ క్యాప్ - ప్రసిద్ధ్ కృష్ణ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- ఆరెంజ్ క్యాప్ - సాయి సుదర్శన్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- అత్యంత విలువైన ఆటగాడు - సూర్యకుమార్ యాదవ్ (రూ. 10 లక్షల నగదుతోపాటు ట్రోఫీ)
- రన్నరప్ జట్టు - పంజాబ్ కింగ్స్ (రూ. 12 కోట్ల నగదుతోపాటు షీల్డ్)