2025 జూన్ 3 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 3rd 2025
మేష రాశి (Aries) 2025 జూన్ 3
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఖర్చులు తగ్గుతాయి, రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు పనితీరుతో మెప్పిస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన సమయం ఉంటుంది.
వృషభ రాశి (Taurus) 2025 జూన్ 3
వృషభ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలున్నాయి. పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అనుకోని ఖర్చులు పెరిగితే డబ్బు సర్దుబాటు కష్టమవుతుంది. కుటుంబం నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రేమ జీవితానికి ఈ రోజు మంచిగా ఉంటుంది. గృహ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini) 2025 జూన్ 3
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనిపై పూర్తి దృష్టి పెడతారు. మంచి ఫలితాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. ఓ పెద్ద వ్యక్తి సహకారంతో మీ పనులు పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఏదైనా విషయంపై ఒత్తిడి ఉండవచ్చు. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer) 2025 జూన్ 3
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ అధికారి సహాయంతో ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రాజెక్టుల నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. పాత వాహనాన్ని అమ్మి డబ్బు సంపాదించే విషయం గురించి ఆలోచిస్తారు. అనవసరమైన గృహ ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పని పూర్తవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గృహ జీవితంలో ఒత్తిడి ఉంటుంది
సింహ రాశి (Leo) 2025 జూన్ 3
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి, కొన్ని పూర్తవుతాయి. వ్యాపారం విషయంలో మీ ప్రణాళికల నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి లాభం లభిస్తుంది. గృహ జీవితంలో ఒత్తిడి పరిస్థితులు ఏర్పడవచ్చు, సంబంధాలను దృష్టిలో ఉంచుకుని తెలివిగా వ్యవహరించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కన్యా రాశి (Virgo) 2025 జూన్ 3
కన్యా రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు. వాతావరణ ప్రభావం వల్ల మీకు ఏ పనిపైనా శ్రద్ధ ఉండదు. ఆదాయం తగ్గుతుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు పెద్ద విజయం లభించవచ్చు . భాగస్వామితో ఏదైనా విషయంపై పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది. వివాహితుల దాంపత్య జీవితం ప్రేమతో కూడుకున్నదిగా ఉంటుంది. ఒకరినొకరు మెరుగైన విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
తులా రాశి (Libra) 2025 జూన్ 3
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపార వృద్ధి చెందుతుంది. కుటుంబంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆందోళనలు పెరిగే అవకాశం ఇవ్వొద్దు. ఒంటరిగా ఉండొద్దు
వృశ్చిక రాశి (Scorpio) 2025 జూన్ 3
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో మీ పనిపై పూర్తి దృష్టి పెడతారు కొత్త పనిని కూడా చేపడతారు. ఉద్యోగస్తులపై పని ఒత్తిడి ఉంటుంది. మీ సౌకర్యాలను పెంచే ఏదైనా వస్తువును కొనుగోలు చేయవచ్చు. గృహ జీవితంలో సంతోషం పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉన్నవారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్నేహితులతో ఏదైనా గొడవల నుంచి తప్పించుకోవడం మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius) 2025 జూన్ 3
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండే సంకేతాలు ఉన్నాయి. ప్రేమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. గృహ జీవితంలో అపోహలు తొలగిపోతాయి మరియు అనుబంధం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బావుంటుంది. మీకున్న తెలివితేటల వల్ల వ్యాపారంలో మెరుగుదలకు దారితీసే ఒప్పందాన్ని చేసుకోవచ్చు. ఆహారంపై శ్రద్ధ వహిస్తే ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.
మకర రాశి (Capricorn) 2025 జూన్ 3
మకర రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలన్నాయి. స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. అతి ఆగ్రహం తగ్గించుకోవడం మంచిది. ఏదైనా విషయంపై మనసులో సందేహం ఉండిపోతుంది..దాని పరిష్కారం కోసం దగ్గరి వ్యక్తితో మాట్లాడవచ్చు. మీ సామాజిక కార్యక్రమాల వల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన సమయం ఉంటుంది. ఖర్చులపై శ్రద్ధ వహించాలి...లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుంభ రాశి (Aquarius) 2025 జూన్ 3
కుంభ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. అయితే పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మీన రాశి (Pisces) 2025 జూన్ 3
మీన రాశి వారికి ఈ రోజు అనుకూల సమయం. చాలా ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపట్టేందుకు మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులతో గొడవ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.