JEE Advanced 2025 Results: సోమవారం ప్రకటించిన కేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మాజిద్ హుస్సేన్ (హెచ్ .నెం: 251134112) 3 వ ర్యాంక్, పార్థ్‌ మందర్ వార్థక్ (హెచ్.నెం: 251110752) 4 వ ర్యాంకు, అక్షత్ చౌరాసియా (హెచ్ టి.నెం: 254065055 6వ ర్యాంక్, సాహిల్ డియో (హెచ్. నెం 251113172) 7 వ ర్యాంక్, వడ్లమూడి లోకేష్ (హెబ్రి.నెం 256061276) 10 వ ర్యాంక్ టాప్ 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు నారాయణ కైవశం చేసుకుందని తెలిపారు. 

అంతే కాకుండా వరుసగా 17, 20, 21, 22, 23, 27, 29, 30, 31, 34, 37, 38, 40, 43, 44, 46, 49, 50, 51, 52, 53, 54, 56, 57, 58, 63, 64, 73, 76, 77, 80, 82, 83, 85, 87, 88, 91, 98 0 5 100 43 విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ సింధూరనారాయణ అండ్‌ శరణినారాయణ తెలిపారు. ఆలిండియా అన్ని కేటగిరీల్లో టాప్ టెన్‌లో 10 ర్యాంకులు, 50లోపు 42 ర్యాంకులు, 100లోపు 75 ర్యాంకులు కైవసం చేసుకుందని ప్రకటించారు. 

ఐఐటి ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేదని, సాటిరారని నారాయణ డైరెక్టర్స్‌  తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,80,000 మందికిపైగా విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా సింధూర నారయణ మాట్లాడుతూ... అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్‌, మైక్రోషెడ్యూల్, బెస్ట్ స్టడీ మెటీరియల్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, టాప్ ఫ్యాకల్టీతోనే ఇంతటి ఘనవిజయానికి కారణాలని తెలిపారు. 8వ తరగతి నుంచే జెఈఈకి అవసరమైన శిక్షణ అందించటంతోపాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ్ వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చిన తక్కువ సమయంలో సరైన సమాధానం గుర్తించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. 

మరో డైరెక్టర్‌ శరణి నారాయణ మాట్లాడుతూ ఎన్-లెర్న్ యాప్ ద్వారా ఛాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు నిర్వహించటం వల్లనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించగలిగారని తెలిపారు. ఈ విధానాల వల్లే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక విద్యార్థులు, జాతీయస్థాయిలో నారాయణ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీల్లోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొన్నారు. టాప్ ర్యాంకులు సాధించిన వారికి అత్యధిక సంఖ్యలో నారాయణ స్కూల్స్‌లో చదివిన విద్యార్థులే ఉన్నారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ అభినందనలు తెలియజేశారు..