Relaxing Things Each Zodiac Sign: చికాకు లేని మనిషి ఉంటారా? ఏదో సందర్భంలో చికాకు పడతారు..కొందరు ఆ ప్రభావాన్ని ఎవరో ఒకరిపై చూపిస్తే మరికొందరు సైలెంట్ గా ఉండిపోతారు..అయితే అలాంటి సమయంలో నార్మల్ అవ్వాలంటే మనసుకి నచ్చిన పని చేయాలి. అదేంటో మీకు తెలిస్తే మంచిదే ..మరి ఏం చేయాలో అర్థం కావడం లేదనే వాళ్లుంటారు....అలాంటి వారు మీ రాశి ప్రకారం ఏం చేస్తే తొందరగా రిలాక్స్ అవుతారో ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి (Aries)
చికాకుగా ఉన్నప్పుడు మేష రాశివారు శారీరక శ్రమ చేయడం మంచిది. వ్యాయామం లేదంటే క్రీడల్లో పాల్గొనాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే మీకు ఒత్తిడి పూర్తిగా దూరమైపోతుంది.
వృషభ రాశి (Taurus)
ఈ రాశివారు మసాజ్ ద్వారా తొందరగా రిలాక్సవుతారు. ఒక్కరూ వాకింగ్ కి వెళ్లడం ద్వారా కూడా ప్రశాంతత పొందుతారు. చికాకులో ఉన్నప్పుడు వృషభ రాశివారు అరోమాథెరపీ, రుచినిచ్చే భోజనం లేదా ఓదార్పు కోరుకుంటారు.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
మిథున రాశి (Gemini)
చికాకుగా ఉన్నప్పుడు మీ మనసులో మాటలన్నీ ఓ బుక్ పై పెట్టండి. పాటో, కవితో రాయడం ద్వారా ఒత్తిడి, చికాకు నుంచి మీ దృష్టి మరలుతుంది. ఇంకా స్నేహితులతో కాసేపు మాట్లాడడం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశివారు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నచ్చిన పుస్తకం చదవాలి. ఓ బుక్ పట్టుకుంటే ప్రపంచానికి దూరంగా వెళ్లిపోతారు , పైగా అసలు తాము ఒత్తిడిలో ఉన్నామనే విషయమే మరిచిపోతారు. చదివేందుకు కూడా ఆసక్తి లేకపోతే కిచెన్లో టైమ్ స్పెండ్ చేయడం బెటర్.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారు బోర్ ఫీలైనప్పుడు మంచి సంగీతం వింటే రిఫ్రెష్ అయిపోతారు. వీరిలో సృజనాత్మక చాలా ఎక్కువ..అందుకే తమలో కళలకు పదును పెట్టడం మంచిది.
Also Read: నేటి రాశిఫలాలు (02-05-2024)
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి బెస్ట్ థెరపీ ఫన్నీ వీడియోలు, కామెడీ మూవీస్ చూడడమే. చికాకుగా ఉన్నప్పుడు రిలాక్స్ గా కూర్చుని, అప్పటి వరకూ చేస్తున్న పనిని అక్కడితో ఆపేసి కాసేపు ఫన్నీ వీడియోస్ చూస్తే ఒత్తిడి తొందరగా తగ్గిపోతుంది.
తులా రాశి (Libra)
తులా రాశివారు నచ్చిన వంట చేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తే ఒత్తిడిని నుంచి ఉపశమనం పొందుతారు.యోగా, ధ్యానం చేయడం ద్వారా కూడా తొందరగా రిలాక్స్ అయిపోతారు.
వృశ్చికరాశి (Scorpio)
వృశ్చిక రాశివారు టేస్ట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్లు చికాకుగా ఉన్నప్పుడు వంట చేసి పెట్టడమో, నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడమో చేయడం బెటర్. లేదంటే ఏకాగ్రత పెంచే ఫజిల్స్ కానీ పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టులలో మునిగిపోవడం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది.
Also Read: మీలో మీకు తెలియని అపరిచితుడు ఇదిగో!
ధనస్సు రాశి (Sagittarius)
ధనస్సు రాశివారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయాణం చేస్తే ఉపశమనం లభిస్తుంది. మంచి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు లేదంటే ఓ కప్ టీ తాగి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే చాలు రిలాక్సైపోతారు.
మకర రాశి (Capricorn)
మకర రాశివారు పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకుంటే తొందరగా రిఫ్రెష్ అవుతారు. అయితే వీళ్లలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒత్తిడిలో ఉన్నప్పుడే సవాళ్లకు సరైన జవాబులు వెతుక్కోగలుగుతారట.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశివారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో ఆడుకుంటే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. సాంకేతితకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఈ రాశివారికి ఆసక్తి ఎక్కువ. ఇదే వీళ్లకి అసలైన విశ్రాంతి
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
మీన రాశి (Pisces)
చికాకుగా ఉన్నప్పుడు మీన రాశివారు...మీకు సంతోషాన్నిచ్చే జ్ఞాపకాల్లోకి వెళ్లిపోండి. పాత ఫొటోలు చూసుకోవడం, పెయింటింగ్ చేయడం, మీతో మీరు స్పెండ్ చేయడం ద్వారా రిలాక్సవుతారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.