Daily Horoscope


మేష రాశి


ఆదాయం పెరుగుతుంది. ప్రణాళికల అమలులో తలెత్తే సమస్యలు తొలగిపోతాయి. కష్టపడి చేసే పనికి  ఫలితం వెంటనే పొందుతారు. స్నేహితుల నుంచి మీకు మద్దతు ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.


వృషభ రాశి


ఈ రాశివారు ఉద్యోగం, వృత్తికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేసే పనిని పూర్తిగా ఆస్వాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. స్వలాభం కోసం స్వార్థంగా వ్యవహరించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి.


మిథున రాశి


మీ తొందరపాటు కారణంగా పనిలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.


Also Read: మీలో మీకు తెలియని అపరిచితుడు ఇదిగో!


కర్కాటక రాశి


కర్కాటక రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా ఉంటారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. 


సింహ రాశి


ఈ రాశి ఉద్యోగులు తమపట్ల విశ్వాసాన్ని పెంచుకుంటారు. అనవసరమైన విషయాలకు కోపం తెచ్చుకోవద్దు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి.    మంచి సహవాసంలో ఉండండి. చర, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి 


కన్యా రాశి 


విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలి. ఆదాయం దృష్ట్యా రోజు చాలా మంచిది. మీ ప్రత్యర్థులపై మీ ప్రభావం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


తులా రాశి 


ఈ రాశివారు షేర్ మార్కెట్‌లో లాభపడతారు. ఏదో విషయంలో బాధగా ఉంటారు, కోపం పెరుగుతుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసేపనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి.


వృశ్చిక రాశి 


ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. ఎవ్వరి నుంచీ ఎక్కువగా ఏమీ ఆశించవద్దు. కుటుంబ సభ్యుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో తగాదాలు రావొచ్చు 


ధనుస్సు రాశి


వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన రావచ్చు. ఈ రాశి ఉద్యోగుల పనితీరుకి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న చాలా పనులు సులభంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. దూర ప్రయాణం ప్లాన్ చేసుకుంటారు. 


Also Read: మే 4 వరూధిని ఏకాదశి, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి ఏం చేయాలి!


మకర రాశి 


ఈ రాశివారు జీవిత భాగస్వామితో ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. అనారోగ్య సమస్యలున్నాయి.  వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. 


కుంభ రాశి


ఈ రోజు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. అత్యుత్సాహంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పనులన్నీ సమయానికి పూర్తిచేస్తారు. ఈ రోజు మీరు ఓ గుడ్ న్యూస్ వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు.


మీన రాశి 


ఈ రోజు మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది...ఖర్చులపై నియంత్రణ ఉండేలా చూసుకోండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో సంతోషం తగ్గుతుంది. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.