Dark Side of  Each Zodiac Sign: కనిపించని నాలుగో సింహంలా ప్రతి మనిషిలోనూ మరొకరు ఉంటారు. తమలో ఉండే మరో కోణం బయటపడకుండా జాగ్రత్తపడుతూ అందరితో గుడ్ అనిపించుకోవాలనుకుంటారు. ఇంతకీ మీలో ఉన్న ప్రతికూల వ్యక్తి మీకు తెలుసా? తెలియకపోతే మీ రాశి వివరంగా చెప్పేస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మీ రాశిప్రకారం మీలో ఉన్న అపరిచితుడిని తెలుసుకోండి మరి...


మేష రాశి 


ఎదుటివారి బాధను చూసి ఆనందపడతారు. ఓర్పు సహనం చాలా తక్కువ. వేరేవారి వ్యక్తిగత విషయాలు తెసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఒక్కోసారి ఆలోచన లేకుండా కార్యాచరణకు దిగిపోతారు. సడెన్ గా కోపంగా మారిపోతారు. చివరకు వీరు ప్రాణంగా ఇష్టపడేవారి దగ్గర కూడా ఇలానే ప్రవర్తిస్తారు...


వృషభ రాశి


ఈ రాశివారు చాలా మొండిగా ఉంటారు. వారు తమ ఆలోచనలను మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అభద్రతా భావంతో ఉంటారు. ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేరు కూడా. ఏదో చేయాలనే ఆతృత పడతారు కానీ అనుకున్నవేమీ సంపూర్ణంగా చేయలేరు


Also Read: ఇవాల్టి నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!


మిథున రాశి


ఈ రాశివారు ఎప్పుడెలా ఉంటారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. నార్మల్ గా ఉన్నట్టే కనిపిస్తారు కానీ అప్పటికప్పుడే మారిపోతారు. వీళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం కష్టం. అందుకే మిథున రాశివారితో మాట్లాడేటప్పుడు ముందు మీరు క్లియర్ గా ఉండాలి. 


కర్కాటక రాశి


మిగిలిన రాశులతో పోల్చితే కర్కాటక రాశివారు చాలా మూడీగా ఉంటారు. తమ గురించి మాత్రమే చూసుకుంటారు..తమ స్వార్థం కోసం వేరేవాళ్లని మాయ చేసేందుకు అస్సలు తగ్గరు. ఎవరితోనైనా అనుబంధం ఉంటే వాళ్లు దూరమైతే తట్టుకోలేరు. బాగానే ఉన్నాం అనుకుంటారు కానీ ఇది వారిలో వారికే తెలియని కోణం...


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


సింహ రాశి


ఈ రాశివారికి అందరూ తమను పొగడాలి, అందరి దృష్టి తమపై ఉండాలనే కోర్కె చాలా ఎక్కువ. ప్రత్యేక మైన గుర్తింపు కోరుకుంటారు... అందుకోసం కొన్నిసార్లు ఎదుటివారికి హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.  


కన్యా రాశి


కన్యా రాశివారికి నాటకాలు బాగా ఎక్కువ. చిన్న చిన్న విషయాలపై చాలా శ్రద్ధ చూపుతారు. అన్నీ తమకు నచ్చినట్టుగానే అవ్వాలనుకుంటారు. వీరి ప్రవర్తన చెడుగా ఉండదు కానీ అందరూ తన కనుసన్నల్లోనే నడవాలని కోరుకుంటారు. ఇది ఇతరులకు చెడుగా అనిపిస్తుంది..


తులా రాశి 


తులారాశివారు తగాదాలను ఇష్టపడరు వాటికి దూరంగా ఉంటారు కానీ కొన్నిసార్లు వివాదాలను పరిష్కరించడానికి బదులు పెద్దవి చేస్తారు. అన్ని పనులు పద్ధతిప్రకారం సాగిపోవాలి అనుకుంటారు...కొన్ని సందర్భాల్లో ఇది మంచిదే అయినా ఈ తీరే అనవసర సమస్యలు సృష్టిస్తుంది.  ఎదుటివారి ఆనందం కోసం తమని తాము కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారు


Also Read: మే 4 వరూధిని ఏకాదశి, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి ఏం చేయాలి!


వృశ్చిక రాశి


ఈ రాశివారు దేనికైనా సందర్భం కోసం చూస్తూ ఉంటారు. ఎదుటివాళ్లు చెప్పింది వింటారు కానీ అది వాళ్లకి నచ్చినట్టుగా ఉంటే మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు లేదంటే అది మంచే అయినా కానీ తలకు ఎక్కించుకోరు. బాధ, కోపంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా రియాక్టవుతారు... ఆ సమయంలో వారితో వాదించే కన్నా వాళ్లు కామ్ అయ్యేవరకూ సైలెంట్ గా ఉండిపోవడమే మంచిది. అన్నింటినీ తాము నియంత్రించాలని చూస్తుంటారు. 


ధనుస్సు రాశి


వీళ్లు అదో రకమైన మూర్ఖులు. తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అన్నట్టు అనుకున్నది చేసేయడమే కానీ అది మంచా చెడా అన్న ఆలోచన ఒక్కోసారి చేయరు. అస్సలు ఆలోచించకుండా మాట్లాడేసి ఎదుటివారిని బాధపెడతారు. తమకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉంటారు. మళ్లీ తక్కువ టైమ్ లోనే రియలైజ్ అవుతారు..


Also Read: చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు - రాశి ఫలాలు 1 మే 2024 !


మకర రాశి


ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో మకర రాశివారు దిట్ట. తమకు కావాల్సిన పనిని సాధించుకునేవరకూ వెనక్కు తగ్గరు. పైగా లేనివి ఉన్నట్టు చాడీలు చెప్పడంలో సిద్ధహస్తులు. తమ స్వార్థం కోసం మోసం చేసేస్తారు. వీరి టార్గెట్ విజయం అంతే...


కుంభ రాశి


మేం చాలా తెలివైన వాళ్లం అనే అభిప్రాయంలో ఉంటారు కుంభ రాశివారు. అందుకే ఎదుటివారు అడగకపోయినా సలహాలు ఇచ్చేస్తుంటారు. అదే వీళ్లని పిచ్చివాళ్లుగా ముద్రవేసేలా చేస్తుంది.  


మీన రాశి


ఈ రాశివారు తాము అనుకున్నది సాధించుకోవడంలో సిద్ధహస్తులు. అందుకోసం ఎదుటి వారి ప్రతిష్టను దిగజార్చేందుకు కూడా వెనుకాడరు. దీనిని వాళ్లు తమలో స్ట్రెంగ్త్ అనుకుంటారు కానీ ఇది వారి నిజస్వరూపం. సందర్భానికి తగినట్టు తమని తాము మార్చేసుకుంటారు అందుకే వీరికి జీవితంలో సమస్యలు చాలా తక్కువ.  మీనరాశి వారితో స్నేహం చేసేవారు మానసికంగా దృఢంగా ఉండం చాలా ముఖ్యం.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.