మీన రాశి  వార్షిక ఫలితాలు (Pisces Yearly Horoscope 2025)


2025 సంవత్సరం ఆరంభం మీన రాశివారికి బావుంటుంది. బృహస్పతి సంచారం మీకు ఆర్థికంగా కలిసొస్తుంది. పెట్టుబడులన్నీ బాగా కలిసొస్తాయి. షేర్ మార్కెట్లో లాభాలొస్తాయి. వ్యాపారం అభవృద్ధి చెందుతుంది. మార్చి ఎండింగ్ లో శని కుంభ రాశినుంచి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. మే లో బృహస్పతి రాశి పరివర్తనం ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అయితే అక్టోబరు 2025 తర్వాత మీ పరిస్థితి మళ్లీ మెరుగుపడుతుంది.


ఆరోగ్యం


జనవరి-ఫిబ్రవరిలో అనారోగ్య సమస్యలుంటాయి..మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. మార్చి , ఏప్రిల్ లో  ఆహారం విషయంలో  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై నుంచి అక్టోబరు వరకూ నిద్రలేమి, రక్తపోటు ప్రభావం ఉంటుంది. ఏడాదిలో చివరి రెండు నెలలు ఆరోగ్యం బావుంటుంది. 


వ్యక్తిగత జీవితం


2025లో మీన రాశివారి వ్యక్తిగత జీవితంలో రాజీ పడాల్సిన సందర్భాలు చాలా ఎదరువుతాయి. కొన్ని ఆకస్మిక సంఘటనల వల్ల ఇబ్బందిపడతారు. ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మీరు చేసే కొన్ని తప్పులవల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రతిష్టకు భంగం కలిగే పనులు చేయొద్దు. జూన్ - సెప్టెంబర్ మధ్య కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుంటాయి. ఇయర్ ఎండ్ ప్రశాంతంగా ఉంటుంది.  


విద్య, ఉద్యోగం


2025లో మీన రాశివారి కెరీర్లో పెద్దగా మార్పులుండవు కానీ అడుగు అడుగు ముందుకు పడుతుంది. మీ సృజనాత్మకత ప్రశంసలు అందుకుంటుంది. కొత్త స్టార్టప్ లు ప్రారంభించేందుకు ఇదే అనుకూల సమయం. శని మీ రాశిలో సంచరించడం వల్ల కొన్ని కష్టాలు తప్పవు కానీ వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం పొందగలరు.  


Also Read: కుంభ రాశివారికి 2025 లో ఆదాయం పెరుగుతుంది కానీ అనుకోని కష్టాలు తప్పవ్.. ఈ నెలలు మీకు కలిసొస్తాయ్!


జనవరి 2025 


ఈ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారం బాగానే ఉంటుంది కానీ కుటుంబంలో మాటపట్టింపులు పెరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడతారు. శారీరక అలసటకు గురవుతారు


ఫిబ్రవరి 2025


ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కానీ సోదరులతో వివాదాలుంటాయి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. 


మార్చి 2025


జన్మంలో శని ప్రవేశించే ఈ నెలలో మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. అనుకోని వివాదాలు చుట్టుముడతాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి కానీ అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. 


Also Read: 2025లో మకర రాశివారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది కానీ !


ఏప్రిల్ 2025


శని ప్రభావంతో అనారోగ్యం, సోమరితం ఉంటుంది.కుటుంబంలో ఆస్తుల గొడవలు జరుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు తప్పవు. 


మే 2025


ఈ నెల మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. సంతానం కారణంగా చికాకులు ఉంటాయి. మీ అభివృద్ధి చూసి ఓర్వలేనివారి సంఖ్య పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. 


జూన్ 2025
 
ఈ నెలలో కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది, మానసిక ఆనందం ఉంటుంది. శుభాకార్యాలకు హాజరవుతారు.  


జూలై 2025
 
ఈ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు కోసం దృష్టిసారిస్తారు. 


ఆగస్టు 2025


ఈ నెలలో వివాదాలు, అధిక ఖర్చులు, ఆగిన పనులు, ప్రయాణాల్లో ప్రమాదాలున్నా..చాలా జాగ్రత్తగా ఉండాలి 


సెప్టెంబర్ 2025
 
ఈ నెల కొంత రిలీఫ్ గా అనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుడుతుంది. ఆనందంగా ఉంటారు. ఆస్తులు కలిసొస్తాయి. 


అక్టోబర్ 2025


ఈ నెలలో భూవివాదాలుంటాయి. దాన ధర్మాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  


నవంబర్ 2025


ఈ నెలలో ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తారు. ప్రమోషన్ తో కూడిన ఉద్యోగాల్లో చేరుతారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల తీర్పు వస్తుంది


Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!


డిసెంబర్ 2025


ఈ నెలలో ఉపశమం లభిస్తుంది. కుటుంబం, సన్నిహితులు, స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.