Holiday Planning for 2025: నూతన సంవత్సరం 2025లో, మీకు దాదాపు 20 సెలవులు వస్తాయి. వాటిని ఉపయోగించుకుని మీరు 60 రోజుల సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ పిక్‌యువర్‌ట్రయల్ (Pickyourtrail) ఈ ప్లానింగ్‌లో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. తద్వారా, మీరు కొత్త సంవత్సరంలో వివిధ ప్రదేశాలను సందర్శించి అనేక అద్భుతమైన అనుభవాలు, అనుభూతులను ఆస్వాదించొచ్చు.
జనవరి 2025
జనవరి 14, మంగళవారం పొంగల్/మకర సంక్రాంతి సెలవు. మీరు జనవరి 13 (సోమవారం) & 15 జనవరి (బుధవారం) సెలవులు పెట్టుకుంటే, జనవరి 11 నుంచి 15 వరకు 5 రోజుల పాటు సెలవులను ప్లాన్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 2025
మహా శివరాత్రి సెలవు ఫిబ్రవరి 26 (బుధవారం). మీరు 24-25 (సోమవారం-మంగళవారం) & 27-28 (గురువారం & శుక్రవారం) సెలవు తీసుకొని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 02 వరకు 9 రోజుల సుదీర్ఘ సెలవుల ప్రణాళికను రూపొందించుకోవచ్చు.
మార్చి 2025
హోలీ సెలవు 14వ తేదీ (శుక్రవారం). మార్చి 12 (బుధవారం) & 13 మార్చి (గురువారం)తో కలుపుకుని, మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు 5 రోజుల పాటు సెలవు తీసుకుని విశ్రాంతి కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
ఏప్రిల్ 2025
గుడ్ ఫ్రైడే సెలవు ఏప్రిల్ 18 (శుక్రవారం). ఏప్రిల్ 17న (గురువారం) సెలవు తీసుకుంటే, శని & ఆదివారం కూడా కలుపుకుని, మీరు పూర్తిగా 4 రోజుల సెలవులను ఆస్వాదించవచ్చు.
మే 2025
కార్మిక దినోత్సవం సెలవు గురువారం, మే 01. ఏప్రిల్ 30వ తేదీ బుధవారం & మే 2వ తేదీ శుక్రవారం సెలవు తీసుకోవడం ద్వారా మీరు మీ బిజీ లైఫ్ నుంచి నుంచి 5 రోజులు పూర్తి విరామం తీసుకోవచ్చు.
ఆగష్టు 2025
ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, మీ కోసం & మీ కుటుంబం లేదా స్నేహితుల కోసం 13 రోజుల సుదీర్ఘ సెలవుల ప్రణాళికను రూపొందించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 శుక్రవారం నాడు సెలవు. మీరు 18-22 (సోమవారం-శుక్రవారం) & 25-26 (సోమవారం & మంగళవారం) నుంచి లీవ్‌లోకి వెళితే, ఆగస్టు 15-27 వరకు ఎంజాయ్‌మెంట్‌కు కొదవ ఉండదు.
సెప్టెంబర్ 2025
ఓనం & మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెప్టెంబర్ 5 శుక్రవారం రోజున సెలవు. మీరు సెప్టెంబర్ 04వ తేదీ గురువారం సెలవు తీసుకుని, శని & ఆదివారం కూడా కలుపుకుని, 4 రోజుల పాటు ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు.
అక్టోబర్ 2025
గురువారం, అక్టోబర్ 02 గాంధీ జయంతి & దసరా సెలవు. ఈ సమయంలో, మీరు అక్టోబర్ 01 బుధవారం & అక్టోబర్ 03 శుక్రవారం సెలవులు పెట్టుకోవచ్చు. శని, ఆదివారం కూడా కలిపితే మీకు అక్టోబర్ 01 నుంచి 05 వరకు 5 రోజుల సెలవుల్లో ఏదైనా హాలిడే స్పాట్‌కు వెళ్లి రావచ్చు.
డిసెంబర్ 2025
క్రిస్మస్ డిసెంబర్ 25 గురువారం. డిసెంబర్ 26 శుక్రవారం & 29-31 (సోమవారం-బుధవారం) & శుక్రవారం 02 జనవరి సెలవులు తీసుకుంటే లాంగ్-ఆఫ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: యూకే స్టుడెంట్ వీసా రూల్స్ మారాయి - మీ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలో తెలుసా?