Horoscope Today 14th  December 2024


మేష రాశి


మేష రాశి వారికి ఈ రోజు  చాలా బాగుంటుంది. ఈరోజు మీరు అనేక రంగాలలో విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం చేయాల్సిరావొచ్చు.   తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.


వృషభ రాశి


అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ కార్యాలలో విజయం ఉంటుంది. కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి.


మిథున రాశి


మిథునరాశి వారు పెద్దల ఆదేశాలను పాటించండి. సామాజికంగా మీ జిజ్ఞాస పెరుగుతుంది. మీ ప్రయాణం విజయవంతమవుతుంది.  ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు.  


Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!


కర్కాటక రాశి


ఈ రోజు ఈ రాశి వారు తెలియని భయంతో ప్రభావితం కావచ్చు. కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. కోర్టు కేసులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టం రావచ్చు. మానసికంగా బాధపడతారు. 


సింహ రాశి 


అతి ఆలోచనల నుంచి బయటపడండి.  ఆస్తుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మంచి రోజు. వ్యాపార పోటీ ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


కన్యా రాశి


ఈ రాశివారు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల నుంచి సలహాలు స్వీకరించండి. మీరు ఏదో ఒక పనిలో ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలు పొందవచ్చు.


తులా రాశి


తులారాశి వారికి ఈరోజు మంచి రోజు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. మీ పనిలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మికంగా దృఢంగా ఉంటారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. మీరు స్నేహితుల నుంచి శుభవార్త అందుకుంటారు.


Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!


వృశ్చిక రాశి


వృశ్చిక రాశి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తి కారణంగా మీరు నష్టపోవచ్చు.  వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర చర్చలు చేయవద్దు. ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.


ధనస్సు రాశి


మీ  సన్నిహితులు ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. బ్యాంక్  సహా ఆర్థిక సంబంధిత పనులు  చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. 


మకర రాశి 


మకర రాశివారికి ఈ రోజు ఆకస్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఓ గుడ్ న్యూస్ వింటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఒకరి పట్ల అభిమానం పెరుగుతుంది. చిన్న పిల్లలతో అనుబంధం ఉంటుంది. యువకులు పోటీ పరీక్షలలో విజయం పొందవచ్చు 


Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది


కుంభ రాశి 


ఈ రోజు మీరు రిస్క్ తీసుకోవద్దు. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 


మీన రాశి


ఈ రోజు కొత్తగా పరిచయం అయిన వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. విలాస వస్తువులపై ఖర్చు చేస్తారు. గతంలో చేసిన తప్పు ఫలితంగా ఇప్పుడు క్షమాపణలు చెప్పాల్సి రావొచ్చు. రాజకీయనాయకులకు కలిసొచ్చే రోజు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి.  


Also Read: 6 నెలలు చికాకులు 6 నెలలు ప్రశాంతత .. గృహం , వాహన యోగం - మిథున రాశి వార్షిక ఫలితాలు 2025!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.