Horoscope Today 08th December 2024
మేష రాశి
మేష రాశి వ్యక్తులు కుటుంబంలో శుభకార్య నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. అన్ని పనులు సజావుగా సాగుతాయి. స్నేహితులతో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. ప్రేమ సంబంధాల విషయంలో ఒత్తిడులు తొలగిపోతాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు.
వృషభ రాశి
విదేశీ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అదనపు డబ్బు ఖర్చు చేస్తారు. విలాసాల పట్ల ఆసక్తి చూపుతారు. ఇతరుల సమస్యలను అర్థం చేసుకుంటారు..మీ శక్తికి తగినట్టు సహాయం చేస్తారు.
మిథున రాశి
మిథున రాశి ఉద్యోగులు కార్యాలయంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. మీ విశ్వాసం ఇంకా పెరుగుతుంది. కుటుంబంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కమిషన్ సంబంధిత పనుల నుంచి ప్రయోజనం పొందుతారు.
కర్కాటక రాశి
కార్యాలయంలోని సహోద్యోగుల కారణంగా మానసికంగా ఇబ్బంది పడతారు. వ్యాపార కార్యకలాపాల్లో కష్టపడినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేరు. తగిన విశ్రాంతి అవసరం. ఆడంబరం , ప్రదర్శన కారణంగా మనస్సులో నిరాశ ఏర్పడుతుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు తొందరపడకండి. వ్యాధుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు
Also Read: ఈ రాశులవారికి ఈ వారం నిరాశగా ఆరంభమై ఉత్సాహంగా పూర్తవుతుంది!
సింహ రాశి
ఈ రాశివారు తమ వ్యాపార లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ దినచర్య సమతుల్యంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం అందుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యలో వస్తున్న ఆటంకాలు తొలగిపోతాయి.
కన్యా రాశి
పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమాచారం పొందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు పనులు సకాలంలో పూర్తి కావు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులను సంప్రదించవద్దు.
తులా రాశి
అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేయకండి. భావోద్వేగాల కారణంగా ఎలాంటి వ్యాపార నిర్ణయాలను తీసుకోకండి. ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు. కుటుంబంలో కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. భాగస్వామ్య ప్రాజెక్టులలో లాభాలు ఉంటాయి. ఎవరికైనా సలహాలు ఇవ్వడం మానుకోండి.
Also Read: ధనుర్మాసం (2024-2025) ఎప్పటి నుంచి ప్రారంభం.. విశిష్టత ఏంటి!
వృశ్చిక రాశి
రోజు ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఏదైనా పెద్ద వ్యాపార ఒప్పందానికి సంబంధించిన సమాచారం వింటారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవచ్చు.
ధనస్సు రాశి
ఈ రోజు అనుకూలమైన రోజు. మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యాపారం నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారు. పిల్లల వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి తీసుకున్న సలహాలు అమలు చేయండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి
మకర రాశి
మకర రాశి వారికి ఇంటి వాతావరణం బాగుంటుంది. సాహిత్య రచనలో నిమగ్నమైన వ్యక్తుల మనస్సులో సృజనాత్మక ఆలోచనలు పుడతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలకు ప్లాన్ చేస్తారు. పరిస్థితిని బట్టి ప్రవర్తనలో కూడా మార్పులు తీసుకురావడం అవసరం.
కుంభ రాశి
ఈ రాశి వారికి కొత్త వ్యాపార ఒప్పందాలు ఉంటాయి. ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగంలో సీనియర్ అధికారుల నుంచి మద్దతు పొందుతారు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.
మీన రాశి
మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను సరళంగా ఉంచుకోండి. వ్యాపారంలో అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. సంక్లిష్టమైన విషయాలను శాంతియుతంగా పరిష్కరించండి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.