Horoscope Today November 29, 2024
మేష రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆహారపు అలవాట్లను నియంత్రించండి. మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ పని ఆశించినదానకన్నా మంచి ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశి ఉద్యోగుల ఆధిపత్యం కార్యాలయంలో పెరుగుతుంది. మీరు మీ పనిని పూర్తి బాధ్యతతో చేస్తారు. ఉద్యోగంలో మీ సహోద్యోగుల నుంచి చాలా నేర్చుకుంటారు. పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. ఎంత కష్టమైన పని అయినా సమయానికి పూర్తిచేస్తారు. ఎవరి పట్ల అసూయ లేదా అసూయ భావాలు కలిగి ఉండకండి. మీరు శుభవార్త పొందవచ్చు.
మిథున రాశి
ఈ రోజు మీకు శుభ దినం. మీ సామర్థ్యాన్ని నమ్మండి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితం పొందుతారు. మార్కెటింగ్ సంబంధిత వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్తగా పెళ్లయిన వారు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రమాదకర పనిని చేసే ముందు భద్రతా ప్రమాణాలను గుర్తుంచుకోండి
Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!
కర్కాటక రాశి
ఈ రోజు వైవాహిక సంబంధాలలో అసమ్మతి రావచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించడంలో ఓ అడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. బంధువులను కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు విషయంలో సీరియస్ గా ఉంటారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు.
సింహ రాశి
ఈ రోజు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో మంచి సమయం గడుపుతారు.మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది. కెరీర్‌లో పెద్ద మార్పు కోసం ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక సంబంధాలలో మానసిక అనుబంధం పెరుగుతుంది. కార్యాలయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు మీ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోండి.అప్పులు చేయొద్దు. సాహిత్యం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పిల్లల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. దూరప్రాంత ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి.
తులా రాశి
ఈ రోజు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సలహాలు మీకు మంచి చేస్తాయి.నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. అవివాహితుల వివాహం గురించి చర్చ జరుగుతుంది. కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు నూతన కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. వ్యాపారంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తాగ ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు.
ధనస్సు రాశి
ఈ రోజు అధికారులు మీ పనితీరుని మెచ్చుకుంటారు. ఉద్యోగంలో మీ హక్కులు పెరుగుతాయి. షేర్ మార్కెట్ నుంచి ధనలాభం పొందే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి.
Also Read: 2024 ఈ రాశులవారికి హ్యాపీ ఎండింగ్.. డిసెంబర్ మాస ఫలాలు!
మకర రాశి
రాజకీయాలకు చెందిన ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి. మీరు కుటుంబ సంబంధాలలో మాధుర్యాన్ని అనుభవిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పొరుగువారితో వివాదాలు పరిష్కారమవుతాయి. ఓ శుభవార్త అందుతుంది.
కుంభ రాశి
ఈ రోజు మీరు కెరీర్‌లో ఓ అడుగు ముందుకేస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. విభేదాలు పరిష్కరించుకునేందుకు మంచి రోజు. ముఖ్యమైన పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావొచ్చు.
మీన రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించవద్దు. అధిక పనిభారం వల్ల అలసిపోతారు. ఆరోగ్యం కొద్దిగా బలహీనపడవచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం క్షీణిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.