Horoscope Today November 16, 2024
మేష రాశి
ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితులను కలుస్తారు. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి . ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనుల పట్ల అజాగ్రత్తగా ఉండకండి.
వృషభ రాశి
ఈ రోజు ఒకేసారి చాలా పనులు ప్రారంభించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది..ఆశించిన ఫలితాన్ని పొందలేరు...కానీ అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. తెలియని వ్యక్తులతో అతి చనువు వద్దు.
మిథున రాశి
మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. కార్యాలయంలో కొన్ని విషయాలపై వాగ్వాదం జరగవచ్చు. పని ప్రదేశంలో అహంకారంతో ప్రవర్తించవద్దు. పనికిరాని విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. కళ్లకు సంబంధించి ఏదైనా సమస్య రావచ్చు.
Also Read: మకరం లోకి శుక్రుడు.. డిసెంబర్ లో ఈ 3 రాశులవారికి ఐశ్వర్యం, ఈ 5 రాశులవారికి మనోవేదన
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కొన్ని స్కీముల్లో డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. అవివాహితుల వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. బంధువులతో సంబంధాలు బావుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. ఎవరి పనిలో జోక్యం చేసుకోకండి
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తకగా వ్యవహరించాలి. అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయండి. మీరు జీవితంలో కొత్త అనుభవాలను పొందుతారు. ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అవివాహితులు వివాహ ప్రతిపాదనలు పొందుతారు.
కన్యా రాశి
ఈ రోజు మీరు చేపట్టిన పని అనుకున్న సమయానికి పూర్తికాదు. అతి విశ్వాసం వల్ల సమస్యలు పెరుగుతాయి. మీరు కొందరకి టార్గెట్ అవుతారు. స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి తగ్గవచ్చు. మీ లోపాలను తొలగించుకోండి.
తులా రాశి
ఈ రోజు అప్పులు తీసుకోవాలనే ఆలోచన కూడా చేయవద్దు. మీ కష్టానికి అర్ధవంతమైన ఫలితాలను పొందలేరు. ప్రేమ సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది. ఒకరిపై వ్యతిరేకత రావచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!
వృశ్చిక రాశి
ఈ రోజు సాధారణ తప్పులను విస్మరించవద్దు. మీ దినచర్యలో సానుకూలతను చేర్చండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సైద్ధాంతిక విభేదాలు పరిష్కారమవుతాయి. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీ వ్యాపార పరిచయాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహా మేరకు పెట్టుబడి పెట్టండి.
ధనస్సు రాశి
ఈ రోజు కార్యాలయంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక లాభం ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా బయటి వ్యక్తులను దూరంగా ఉంచండి. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. హోటల్ వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు అవసరం.
మకర రాశి
ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ సంబంధాలలో సందేహాలు తలెత్తవచ్చు. కళా రంగానికి సంబంధించిన వ్యక్తులకు రోజు మంచిది కాదు. బడ్జెట్ అసమతుల్యత కారణంగా పని చెడిపోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి
కుంభ రాశి
మీరు ఈ రోజు వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. సరైన అవగాహన లేని విషయాలపై అతిగా స్పందించడం మంచిది కాదని తెలుసుకోండి.అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు అవసరమైన కొనుగోళ్ల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావచ్చు.
Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!
మీన రాశి
నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. మీ సహోద్యోగుల ప్రవర్తన మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక మేరకు అన్ని పనులు జరుగుతాయి. కష్టపడి పని చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.