2021 ఆగస్టు 15 ఆదివారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కానీ ఓ చిన్న విషయం గురించి ఆలోచిస్తూ కలత చెందుతారు. ఈ ప్రభావం, ఇంట్లో, కార్యాలయంలో చేసే పనులపై పడుతుంది. ఈ రోజు విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఇంటి సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచన.
వృషభం
మీరు సానుకూల ఆలోచనలను కలిగి ఉన్నారు. సృజనాత్మక శక్తి ఉన్నప్పటికీ, నిశ్శబ్దంగా కూర్చోవడం ఒత్తిడిని పెంచుతుంది. అయితే మీ కష్టానికి ఫలితం అందుకోవడం ఆలస్యం కావొచ్చు..కానీ మంచి ఫలితం దక్కడం ఖాయం. క్షణికమైన ఆనందాల వలలో చిక్కుకోకండి. కుటుంబ సభ్యల మద్దతు ఉంటుంది.
మిథునం
ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనుకుంటే...మీ సంతోషంతో రాజీపడవలసివస్తుంది.మీ ఊహాశక్తి... మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. విద్యా రంగంలో నిరాశపరిచే ఫలితాలు ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పెద్దలపట్ల విధేయత చూపడం వల్ల శుభఫలితాల పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
Also Read:ఈ రాశులవారి ఆలోచనలు డబ్బుచుట్టూనే తిరుగుతాయ్…డబ్బు-పరపతి చూశాకే ప్రేమలో పడతారు…https://telugu.abplive.com/lifestyle/zodiac-signs-their-thoughts-on-these-constellations-revolve-around-money-and-fall-in-love-with-people-1604/amp
Also Read: ఈ ఐదు రాశులవారు ప్రేమ వివాహలకే ఆసక్తి చూపిస్తారు, ఆరు నూరైనా సరే!
కర్కాటక రాశి
మీ సహోద్యోగులతో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. ఓపికగా ఉండడం ద్వారా...మీ శ్రేయోభిలాషులను త్వరలోనే గుర్తిస్తారు. ఈ రోజు మీ బంధువులు, స్నేహితుల కోసం డబ్బులు ఖర్చుచేస్తారు. ఎవరి మాటలు విని ఏ పనీ ప్రారంభించవద్దు. విద్యా రంగంలోనూ నిరాశపరిచే ఫలితాలు వస్తాయి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.
సింహం
శుభవార్తతో మీ రోజు ప్రారంభమవుతుంది. చాలా కాలంగా వేస్తున్న ప్రణాళిక ఈరోజు కార్యరూపం దాల్చవచ్చు. సరికొత్త ఉత్సాహంతో ఉంటారు. పోటీ రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. కార్యాలయంలో మంచి విజయాన్ని పొందుతారు. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి.
కన్య
కోపం కారణంగా మీరు వెంటనే స్పందించే మానసిక స్థితిలో ఉన్నారు. అయితే మీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించండి. మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని మీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోండి. ఈ రోజు ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. సోమరితనం వద్దు. తెలియని వ్యక్తులనుంచి హాని కలగొచ్చు.
Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు
Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….
తులారాశి
మెండిగా ప్రవర్తించడం ద్వారా మీరేమీ సాధించలేరని అర్థం చేసుకోండి. మీ ప్రస్తుత సమస్యలను అధిగమించడానికి ప్రశాంతంగా ఉండండి. కొన్ని విషయాలకు సంబంధించి మీ కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు ముదురుతాయి.
వృశ్చికరాశి
మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. ఈరోజు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఆర్ధిక లాభాలు పొందే అవకాశం ఉంది, షాపింగ్ ఖర్చులను గమనించండి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మరో వ్యక్తి మాటలు వినడం ద్వారా నష్టాలు ఎదుర్కొంటారు. వ్యాపార పరిస్థితులు చక్కగా ఉంటాయి.
ధనుస్సు
ఈ రోజు ఒంటరిగా పనిచేస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు... బృందంగా పని చేస్తే ఈ అడ్డంకులు మిమ్మల్ని బాధించవు. పరస్పర సహకారంతో ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధించగలుగుతారు. ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా లేనందున మీరు చాలా సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు.
Also Read: మీ పిల్లలు ఈ రాశుల్లో పుట్టారా?...అయితే చాలా తెలివైన వాళ్లు…
https://telugu.abplive.com/astro/children-of-these-zodiac-signs-are-really-intelligent-94/amp
మకరం
మీ చుట్టూ ఉన్నవారిని నమ్మండి. వారితో స్నేహం చేయడానికి ఇదే మంచి సమయం. మీ స్వభావంలో కోపం, మొండితనం కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబ సభ్యులతో విబేధాలు ఉండవచ్చు. పని ప్రదేశంలో శుభవార్తలు వింటారు. చాలా కాలం తర్వాత ఓ వ్యక్తిని కలుస్తారు. వృద్ధులకు సేవ చేయండి.
కుంభం
ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి...వారితో మర్యాదగా ఉండండి. విజయం దిశగా అడుగులేస్తున్నా కానీ చివరి నిమషం వరకూ జాగ్రత్తగా ఉండండి. సమస్యల గురించి ఎక్కువగా చింతించకండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. అదృష్టం కలిసొస్తుంది. మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
మీనం
భాగస్వాములతో కలసి పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. కానీ మీ భాగస్వాముల నుంచి ఊహించని పరిస్థితిలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు శుభఫలితాలు పొందుతారు. తల్లికి సేవ చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి...
Also Read: Astrology Tips: ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు
Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...