Horoscope Today (సెప్టెంబరు 10 రాశిఫలాలు)


మేష రాశి


మేష రాశివారు ఈ రోజు నిందలు ఎదుర్కోవాల్సి రావొచ్చు..ధైర్యంగా ఉండాలి. దినచర్యలో కొంత గందరగోళం ఉంటుంది. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు మానుకోవడం మంచిది. అనారోగ్య కారణాల వల్ల మీరు కొన్ని పనులను వాయిదా వేయాల్సి వస్తుంది.


వృషభ రాశి


మీరు మీ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చేందుకు కృషి చేస్తారు. వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. కుటుంబంలో  ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.


మిథున రాశి


ఈ రాశివారికి కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతికూల వాతావరణం మిమ్మల్ని శాసిస్తుంది. అయినప్పటికీ వాటిని అధిగమించి కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. కొందరు గొప్ప వ్యక్తులను కలుస్తారు. 


Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!


కర్కాటక రాశి


మీరు కెరీర్‌కు సంబంధించి ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పరస్ప ఆలోచనల మార్పిడి వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పు, సంయమనంతో పని చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. షేర్ల వ్యాపారం చేసేవారు లాభపడతారు.


సింహ రాశి


ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ప్రయాణంలో అలసిపోతారు కానీ ఫలవంతంగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడవద్దు. మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. 


కన్యా రాశి


కన్యా రాశి వ్యాపారులు ఈ రోజు పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. భౌతిక సుఖాలను అనుభవిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలోని అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. సరైన సమయంలో ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏదో ఒక రంగంలో ప్రత్యేక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు. 


Also Read: 'నాస్తికో వేదనిందకః'- కలియుగంలో ఇంతేనా, సనాతనధర్మంపై వివాదం ఈ కోవకే చెందుతుందా!


తులా రాశి


ఈ రాశివారు ఈ రోజు విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు శుభదినం. స్నేహితుల నుంచి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. మీలో  ఆత్మవిశ్వాసం, మనోబలం పెరుగుతాయి.


వృశ్చిక రాశి


ఈ రోజు ఏదో ఒక పని కోసం ప్రయాణిస్తారు. అనుకోని అతిథులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. ఆదాయంతో పాటూ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


ధనుస్సు రాశి


మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కారణంగా మీరు బాధపడతారు. శక్తివంతంగా, సానుకూలంగా ఉండేందుకు వ్యాయామం ధ్యానం చేయడం మంచిది. మీ బలహీనతను ఎవ్వరి ముందూ వ్యక్తపరచవద్దు. ఇంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసర  ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. 


మకర రాశి


ఈ రాశివారు కొత్త ప్రణాళికలు అమలు చేసే పనిలో ఉంటారు. మీ కార్యాలయంలో జరిగే కొన్ని మార్పుల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. సాయంత్రం తర్వాత పరిస్థితులు సర్దుమణుగుతాయి.


కుంభ రాశి


కుంభ రాశివారికి ఈ రోజు మంచి రోజు. మీ తెలివితేటలకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ బాధ్యతల గురించి ఆందోళన చెందుతారు. మీ దినచర్యను సక్రమంగా ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. 


మీన రాశి


ఈ రాశివారు అవసరమైన ఖర్చుల గురించి గందరగోళానికి గురవుతారు. మీ ప్రణాళికల గురించి సందేహించవద్దు, తొందరపడి అమలు చేయవద్దు. మీ కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమ్మతితో నిర్ణయం తీసుకుంటే మంచిది. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మీ ప్రవర్తన కొన్ని బంధాలను దూరం చేసే అవకాశం ఉంది. 


Also Read: వినాయ‌క చ‌వితి 18, 19 తేదీల్లో ఏ రోజు జ‌రుపుకోవాలి - పండితులు ఏమంటున్నారు!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.