Horoscope Today 09th January  2024  - జనవరి 09 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


మనసులో ఆశ, నిస్పృహలు ఉంటాయి. అదనపు పని బాధ్యతలను పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. భూమి , వాహన ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఈ రోజు మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కానీ ఏదో తెలియని భయం వెంటాడుతుంది. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటుంది. విద్యార్థులకు శుభసమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి.


మిథున రాశి (Gemini Horoscope Today)


ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. ఆస్తులు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కొన్ని సవాళ్లు తప్పవు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు 


Also Read: సంక్రాంతి నుంచి ఈ 6 రాశులవారికి మంచి రోజులు మొదలు!


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహన నిర్వహణకు ధనం వెచ్చిస్తారు. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. మీరు కార్యాలయంలోని పై అధికారుల నుంచి మద్దతు పొందుతారు. పనిలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు.


సింహ రాశి (Leo Horoscope Today)


మానసిక ప్రశాంతత పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ బాధ్యతను స్వీకరించడానికి పూర్తి విశ్వాసంతో ఉంటారు. స్నేహితుని సహాయంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  కోపాన్ని నియంత్రించుకోండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. 


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభసమయం. ఏవో తెలియని భయాలు మనస్సును కలవరపరుస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు ఉంటాయి. భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు సాధ్యమే. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. మీరు మీ ప్రియమైనవారి నుండి మద్దతు పొందుతారు. వాహన నిర్వహణకు ధనాన్ని వెచ్చిస్తారు


Also Read: ఈ వారం ఈ ఒక్క రాశివారికి మినహా మిగిలిన అందరకీ అనుకూల ఫలితాలే - జనవరి 08 to14 వారఫలాలు


తులా రాశి (Libra Horoscope Today) 


మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. మితిమీరిన కోపం ఉండవచ్చు. పని బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించండి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. మీరు కార్యాలయంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు. మాటలో మాధుర్యం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. మీరు ఈరోజు పాత స్నేహితులను కలవవచ్చు. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. 


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


మనస్సు ఆనందంగా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరగవచ్చు, కానీ కష్టపడి మరియు అంకితభావంతో చేసే పని అపారమైన విజయాన్ని అందిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. డబ్బుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. 


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


మకర రాశి (Capricorn Horoscope Today) 


సామాజిక హోదా, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత మిత్రులతో కలుస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


ఈరోజు సాధారణంగా ఉంటుంది. మేధోపరమైన పని నుంచి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. డబ్బు ప్రవాహం పెరుగుతుంది. కళలు,  సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చాలా కాలంగా నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుంది.


మీన రాశి (Pisces Horoscope Today) 


ఈ రోజు మీకు ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉండదు. వ్యాపారం పట్ల అవగాహన కలిగి ఉండండి. కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. భావోద్వేగాలలో హెచ్చుతగ్గులు సాధ్యమే. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.