ఫిబ్రవరి 19 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం కోసం పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. జీవిత భాగస్వామి  భావాలను గౌరవించండి. సామాజిక పనిపై మీ ఆసక్తి పెరుగుతుంది. 


వృషభ రాశి


ప్రియమైనవారితో గడపాలని కోరుకుంటారు. తలనొప్పితో ఇబ్బందిపడతారు. మైగ్రేన్ రోగులు ఆహారం, నిద్ర గురించి ప్రత్యేకంగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ తెలివిని సరిగ్గా వినియోగించుకోండి. ఈ రోజు మీకు పని ఒత్తిడి పెరుగుతుంది.


మిథున రాశి


ఈ రోజు మీ మాటతీరులో జాగ్రత్త అవసరం. విమర్శలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి. మంచి ఆహారం తీసుకోండి. పొట్టకు సంబంధించిన వ్యాధులు ఇబ్బందిపెడతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది.


Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!


కర్కాటక రాశి


వైద్య నిపుణుల ఆదాయం పెరుగుతుంది. పిల్లలు  క్రమశిక్షణతో ఉంటారు. బంధువులకు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు మీ మానసిక స్థితి బావుంటుంది. 


సింహ రాశి


దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. సైన్స్  అండ్ టెక్నాలజీ పట్ల ఆకర్షితులవుతారు. తీర్థయాత్రలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలి. మీ గౌరవం విషయంలో రాజీ పడొద్దు.


కన్యా రాశి


ఈ రోజు మీకు ప్రయోజనం లభిస్తుంది. ప్రత్యర్థులు మీ పట్ల చురుకుగా ఉంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలను ఇంట్లో చర్చించండి.


Also Read: ఫిబ్రవరి ఆరంభం నుంచి ఏప్రిల్ 18 వరకూ ఈ 4 రాశులవారిపై శని తీవ్ర ప్రభావం!


తులా రాశి


ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. ప్రత్యర్థులు మీ పట్ల చురుకుగా ఉంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. 


వృశ్చిక రాశి


అతి ఉత్సాహంతో వ్యవహరించకండి. మీరు పిల్లల పురోగతి పట్ల సంతోషంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి మీకు ప్రయోజనాలు అందిస్తుంది. మీ ప్రతిభ , సామర్థ్యం ప్రశంసలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. కొత్త ప్రేమ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి.


ధనుస్సు రాశి


ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రదేశం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరగడంతో నిరాశ చెందుతారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు వారి లక్ష్యాల గురించి విధేయత చూపాలి.


మకర రాశి


ఈ రోజు నూతన ఉత్సాహంతో కొత్త పని ప్రారంభిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నియమాలను అనుసరించండి. శారీరక నొప్పితో బాధపడతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.


కుంభ రాశి


ఈ రోజు మీరున్న రంగంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అనవసరమైన ఖర్చులపై నియంత్రణ అవసరం. ప్రేమ వ్యవహారాలలో కొంత తేడా ఉండవచ్చు. అనవసర విషయాలపై అతిగా చర్చలు పెట్టుకోవద్దు.  


మీన రాశి


ఈ రోజు వ్యాపారంలో పెద్ద అవకాశాలు పొందుతారు. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నిర్మాణ పనులు మంచి ఫలితాలు పొందుతాయి.  ఉద్యోగంలో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆస్తి కొనుగోలు, అమ్మకం నుంచి డబ్బు ప్రయోజనం పొందబోతున్నారు.


Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.