Effects of Shani Dev 2025 : సూర్య పుత్రుడు, శని భగవానుడు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. రెండున్నరేళ్లుగా కుంభంలో ఉన్న శనిదేవుడు.. ఏప్రిల్ 18 నుంచి మీన రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటివరకూ కుంభ రాశిలోనే సంచరిస్తాడు. అప్పటివరకూ నాలుగు రాశులవారిపై శని తీవ్ర ప్రభావం ఉంటుంది. 


మీ రాశి నుంచి శని సంచరిస్తే స్థానాన్ని లెక్కవేసుకోవాలి.. ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు శని.. అంటే..


మేష రాశి నుంచి 11 వస్థానం
వృషభ రాశి నుంచి 10వ స్థానం
మిథున రాశి నుంచి 9వ స్థానం
కర్కాటక రాశి నుంచి 8వ స్థానం
సింహ రాశి నుంచి 7 వ స్థానం
కన్యా రాశి నుంచి 6 వ స్థానం
తులా రాశి నుంచి 5వ స్థానం
వృశ్చిక రాశి నుంచి 4వ స్థానం
ధనస్సు రాశి నుంచి 3వ స్థానం
మకర రాశి నుంచి 2వ స్థానం
కుంభ రాశిలో జన్మస్థానం
మీన రాశిలో 12వ స్థానం


Also Read: కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భగవద్గీత.. రామ రావణ యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం - మీ విజయం కోసం ఇది అవసరం!


శని సంచరించే ఈ స్థానాలను బట్టి మీపై ప్రభావం ఆధారపడి ఉంటుంది. 


మీ రాశి నుంచి శని సంచారం 12,1,2 స్థానాల్లో ఉంటే ఏల్నాటి శని అంటారు. అంటే ప్రస్తుతానికి ఏల్నాటి శని ఉన్న రాశులు మీనం, కుంభం, మకరం.  శని 12 వ స్థానంలో సంచరించేటప్పుడు చేపట్టిన పనుల్లో చిక్కులు, వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శని 1 వస్థానంలో ఉంటే అనారోగ్యం, నిందలు పడడం, జీవిత భాగస్వామితో వివాదాలు, మనశ్సాంతి లేకపోవడం ఉంటాయి. శని రెండో స్థానంలో ఉంటే.. అంతా బావున్నట్టే ఉంటుంది కానీ ఏదీ పూర్తికాదు. అప్పులు, అనారోగ్యం, మానసిక బాధలు తప్పవు
 
మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శని సంచరిస్తే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రభావం వృశ్చిక రాశివారికి ఉంది. ఈ సమయంలో రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో చిక్కులు తప్పవు. కుటుంబంలో అశాంతి ఉంటుంది. స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు ఉంటాయి.
 
మీ రాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అని పిలుస్తారు. ఇప్పుడీ ప్రభావం కర్కాటక రాశివారికి ఉంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఆటంకాలు, వ్యాపారంలో ఇబ్బందులు, స్థిరమైన ఆలోచనలు లేకపోవడం, అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువులు పొంచి ఉంటారు..ఊహించని నష్టాలుంటాయి 


Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!


మీ రాశి నుంచి శని పదో స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. ఇప్పుడీ ప్రభావం వృషభ రాశివారిపై ఉంది. అంత ఇపబ్బంది ఉండదు కానీ అనుకోని విభేదాలుంటాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది.  


ఏప్రిల్ 18 వరకూ కంభ రాశిలోనే శని సంచరిస్తాడు కాబట్టి..అప్పటివరకూ శని ప్రభావం ఉన్న రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.


2025 ఏప్రిల్  18 తర్వాత నుంచి కర్కాటక రాశివారికి అష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది...


వృశ్చిక రాశివారికి అర్దాష్టమ శని నుంచి విముక్తి దొరుకుతుంది


మకర రాశివారికి ఏకంగా ఏల్నాటి శని నుంచి విముక్తి లభిస్తుంది...


Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!