ఫిబ్రవరి 5 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీరు చేసే పనులపై ఎక్కువ శ్రద్ధ అవసరం. క్రొత్త ఆలోచనలను ఓపెన్ మైండ్ తో అంగీకరించండి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ కర్మపై విశ్వాసం కలిగి ఉండండి. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు


వృషభ రాశి


కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అతి లాభాల కోసం ఎక్కువ పెట్టుబడులు పెడితే నష్టపోకతప్పదు. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. మీ పనితో మీరు సంతృప్తి చెందుతారు


మిథున రాశి


ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు పరస్పర వాతావరణంలో పరిష్కరించుకుంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు


Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!


కర్కాటక రాశి


ఈ రోజు వ్యాపారంలో సహోద్యోగులందరినీ నమ్మవద్దు. సహనం , సంయమనంతో పనిచేస్తే విజయం పొందడం ఖాయం. వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకోండి. నిర్లక్ష్యం కారణంగా నష్టపోతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి: 


సింహ రాశి


ఈ రోజు మీ పని తీరు ప్రశంసలు అందుకుంటుంది.  ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించవచ్చు. ఉన్నత విద్యలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహం ప్రేమ సంబంధంగా  మారుతుంది.  స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.


కన్యా రాశి


ఈ రోజు మీరు చేయాలి అనుకున్న పని ఆగిపోయినప్పటికీ దాని గురించి ఒత్తిడి తీసుకోవద్దు. పనిలో మీ నాణ్యతను మరింత పెంచండి. మీ ఆనందాన్ని, బాధను మీ జీవిత భాగస్వామితో పంచుకోవాలి. నిరుద్యోగులు కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.ఉద్యోగులకు శుభసమయం


తులా రాశి


మీరు ఈ రోజు శుభవార్త పొందవచ్చు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి నిన్నటివరకూ వెంటాడిన అడ్డంకులు తొలగిపోతాయి. మీకు మీరే  ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అవసరమైన పని తక్కువ సమయంలోనే విజయవంతంగా పూర్తిచేస్తారు.


వృశ్చిక రాశి


ఈ రోజు మీకు గొప్ప రోజు అవుతుంది. మార్కెటింగ్ రంగానికి సంబంధించిన కార్యకలాపాల వల్ల ప్రయోజనం పొందుతాయి. ఇంటా బయటా చురుగ్గా ఉంటారు.  తెలివితేటలతో చాలా అడ్డంకులను అధిగమిస్తారు. మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది.


Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!


ధనస్సు రాశి


ఈ రోజు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వారు ప్రయోజనం పొందుతారు. పిల్లల పురోగతితో ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులు అధ్యయనాలపై ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా ఆలోచిస్తారు. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. 


మకర రాశి


ఈ రోజు మీతో పాటూ ఉన్న సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా వ్యవహరించి బయటపడండి.  ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. చట్టపరమైన విషయాలలో కొంత చికాకు తప్పదు. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి
 
కుంభ రాశి


 ఈ రోజు పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీరున్న రంగంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీ ప్రతిభ నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటారు. పిల్లతో సంతోష సమయం గడుపుతారు. అనుకున్న పనులన్నీ  సమయానికి పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలలో ఉపశమనం ఉంటుంది. 


Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!


మీన రాశి


ఈ రోజు ఉద్యోగ వ్యవహారాల కన్నా వ్యక్తిగత విషయాలపై ఆసక్తి ఉంటుంది. కుటుంబంతో సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉన్నత విద్యకోసం విద్యార్థులు చేసే ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. సోమరితనం వీడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.