ఫిబ్రవరి 11 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. కెరీర్ కి సంబంధించి ప్రోత్సాహకరమైన సమచారం పొందుతారు. శుభకార్యాలు నిర్వహణ కోసం ఆలోచిస్తారు. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ కృషికి అర్థవంతమైన ఫలితాలు పొందుతారు. 


వృషభ రాశి


ఈ రోజు కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు.  డబ్బును కొన్ని తప్పుడు పనులకు వినియోగించే అవకాశం ఉంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి సలహాల నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలలో ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.


మిథున రాశి


ఈ రోజు ఉద్యోగులు నూతన అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధం తీపిగా ఉంటుంది. మీరున్న రంగంలో కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ దినచర్యను సరిగ్గా ప్లాన్ చేసుకోండి


Also Read: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!


కర్కాటక రాశి


ఈ రోజు ఆర్థిక విషయాలకు మంచిది కాదు. స్నేహితులతో ఘర్షణ ఉండవచ్చు. ఆఫీసు వాతావరణంపై నిఘా ఉంచండి. కొత్త ప్రయోగాలు చేయొద్దు. భావోద్వేగాలు నియంత్రించడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెంచుకోవద్దు. రహస్య విషయాలను అధ్యయనంపై ఆసక్తి కలిగి ఉంటారు.


సింహ రాశి


ఈ రోజు కుటుంబ సభ్యులతో అర్ధవంతమైన సమయాన్ని గడుపుతారు. ఉన్నత అధికారుల ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. నిరుద్యోగులు మంచి సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ప్రేమ సంబంధాలకు రోజు చాలా పవిత్రమైనది.  


కన్యా రాశి


ఈ రోజు కష్టపడాల్సి ఉంటుంది. నూతన ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ రోజు శుభప్రదం. నిలిచిపోయిన పని అకస్మాత్తుగా విజయవంతమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు. 


Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయ్ - ఫిబ్రవరి 10 నుంచి 16 వార ఫలాలు!


తులా రాశి


ఈ రోజు ఇంట్లో-ఉద్యోగం-వ్యాపారంలో మీ బాధ్యతలు రెట్టింపు అవుతాయి. డయాబెటిస్ రోగులు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.  ప్రేమ సంబంధాలు కుటుంబ ఆమోదం పొందే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోకండి. 


వృశ్చిక రాశి


భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. పాత సమస్యలతో మళ్ళీ చిక్కుకునే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆతురుతలో ఉద్యోగాన్ని మార్చాలని నిర్ణయించుకోకూడదు. డబ్బు సంబంధిత విషయాల గురించి జాగ్రత్త వహించండి.


Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!


ధనుస్సు రాశి


ఈ రోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. వాణిజ్య రంగంలో గొప్ప విజయాన్ని పొందుతారు. సొంతంగా చేసే వ్యాపారాలు కలిసొస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


మకర రాశి


పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు కొత్త రచనలను ప్రారంభించవద్దు. మీరు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు బయట పడే అవకాశం ఉంది. రహస్యాలను దాచలేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. 


కుంభ రాశి


ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన పనిలో పాల్గొంటారు. నూతన ఉద్యోగం కోసం వెతికేవారికి ఇంకొన్నాళ్లు నిరీక్షణ తప్పదు. పిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఈ రోజు నూతన ప్రయోగాలు చేయొద్దు. 


మీన రాశి


అనవసర ఖర్చులు తగ్గించాలి. వ్యాపారంలో రిస్క్ చేయొద్దు. నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయండి. వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.