Weekly Horoscope : ఫిబ్రవరి 10 సోమవారం నుంచి ఫిబ్రవరి 16 ఆదివారం వరకూ వారఫలాలు ఇక్కడ తెలుసుకోండి..


వృషభ రాశి (Taurus Weekly Horoscope)


ఈ వారం బుధుడి శుభ స్థానం కారణంగా  మీరు వ్యాపారానికి సంబంధించి సమావేశానికి హాజరవుతారు. మంచి ఫలితాలు సాధిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన వారి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు తమ అధ్యయనాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ భావజాలంలో సానుకూల మార్పులు ఉంటాయి. పెళ్లికాని వ్యక్తుల వివాహం కోసం చర్చలు జరుగుతాయి. మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తారు. మీ ప్రవర్తనలో దూకుడు ఉండకూడదు. వారాంతంలో మీ సమయాన్ని వృథా చేయవద్దు.  ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు


మిథున రాశి (Gemini Weekly Horoscope) 


ఈ వారం వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది..ఫలితంగా పాత నష్టాలను భర్తీ చేస్తారు. దినచర్య, ఆహారంలో పెద్ద మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అందర్నీ ప్రశంసిస్తారు..అందుకే మిమ్మల్ని అంతా ఇష్టపడతారు. ఒంటరి వ్యక్తుల జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి వస్తారు. ఉద్యోగంలో మెరుగైన ఫలితాల కోసం మరింత దృష్టి సారించాలి. అనవసర ఆలోచనల కారణంగా మీరు ఉత్తమ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కీళ్ల నొప్పులుంటాయి.కొత్త భావజాలంవైపు ఆకర్షితులవుతారు. జీవితభాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.


Also Read: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!


తులా రాశి (Libra Weekly Horoscope) 


కెరీర్‌లో మీరు ఈ వారం శుభ ఫలితాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సన్నిహిత వ్యక్తితో ముఖ్యమైన సమస్యపై  చర్చిస్తారు. మతపరమైన పనులలో పాల్గొంటారు. సాంఘిక సంస్థ నుంచి అవార్డును కూడా స్వీకరించవచ్చు.  కుటుంబ జీవితం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. లగ్జరీ కోసం డబ్బు ఖర్చు చేస్తారు.యోగా- వ్యాయామంపై దృష్టి సారించండి. వారాంతంలో జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. కఠినంగా మాట్లాడొద్దు. 


ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 


ఈ వారం మీరు భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం.  మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఓ ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి వస్తుంది. ఇంట్లో ఏదైనా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వారం ఆరంభంలో కుటుంబ సభ్యులు, బంధువులతో వివాద సూచనలున్నాయి. 


మకర రాశి (Capricorn Weekly Horoscope)


ఈ వారం ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగులు కృషికి తగ్గట్టు అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు. మీ రచనలను అభినందిస్తారు. కొత్త సృజనాత్మక ఆలోచనల ప్రభావంతో మంచి ఫలితాలు సాధిస్తారు. మార్కెటింగ్‌ రంగంలో ఉండేవారు మంచి విజయాన్ని పొందుతారు. రాజకీయాలలో ఉండేవారికి  నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. వారం ప్రారంభం మీ కోసం శుభ ఫలితాలు అందిస్తుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులుంటాయి. రక్తపోటు రోగులు వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.  


Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!


మీన రాశి (Pisces Weekly Horoscope) 


పాత వివాదాలు సమసిపోతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కళా ప్రపంచంలో సంబంధం ఉండేవారికి ప్రోత్సాహకర సమయం ఇది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. వారం ఆరంభం అనారోగ్య సమస్యలున్నా వారాంతానికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మితిమీరిన కోర్కెలు నివారించే ప్రయత్నం చేయండి...ఇది మీ భవిష్యత్ పై పరోక్షంగా ప్రభావం చూపిస్తుంది.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.