మార్చి 12 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీరు పనిచేసే ప్రదేశంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అనవసర ఖర్చులను నివారించాలి. కోపం తగ్గించుకోండి.  ఆలోచించడంలో ఎక్కువ సమయం వృథా చేయవద్దు. నిలిచిపోయిన పనులు మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంటాయి. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.  ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి


ఈ రాశివారికి స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. మీ ఆలోచనలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చేపట్టిన పనులకు అంతరాయం కలుగుతుంది.  (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మిథున రాశి


ఈ రోజంతా యాక్టివ్ గా ఉంటారు, ప్రమాదకర పనులకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తవుతాయి. పరిశోధనపై ఆసక్తి పెరుగుతుంది. మీ చుట్టూ ప్రమాదకర వ్యక్తులున్నారు జాగ్రత్త.  (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణం ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లికానివారికి వైవాహిక ప్రతిపాదనలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. 


సింహ రాశి


ఈ రాశివారు కొత్త ప్రాజెక్టులు తీసుకునేందుకు ఇబ్బంది పడతారు.మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. 


కన్యా రాశి


కన్యారాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు అడ్డంకులున్నా పూర్తవుతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగంలో పెద్దగా మార్పులుండవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి


తులా రాశి


తులా రాశివారి ఆరోగ్యం బావుంటుంది. మానసికంగా బలహీనంగా ఉంటారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు.  మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. కొత్త విషయాలను అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించండి.


వృశ్చిక రాశి


ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార పర్యటనలకు ఈ రోజు చాలా మంచిది. ఉద్యోగుల విశ్వాసం కారణంగా బాస్ సంతోషంగా ఉంటాడు.  ఈ రోజు మీరు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి.


ధనస్సు రాశి


మీరు మీ పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న లోపం కారణంగా చేపట్టిన పనులు ఆగిపోతాయి. కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలుంటాయి. ప్రమాదకర వస్తువులను జాగ్రత్తగా వినియోగించండి. 


మకర రాశి


ఈ రాశివారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది.  పోటీ పరీక్షలో ఉత్తమ విజయాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అతిథులు ఇంటికి రావచ్చు. 


కుంభ రాశి


ఈ రోజు మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలతో ఇబ్బంది పడతారు.  కోపం ప్రభావం మీ పనితీరుపై పడుతుంది.  శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన అంశాలను చర్చించడం మానుకోండి.


మీన రాశి


కోల్పోయిన దాన్ని మీరు ఈ రోజు తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులు కెరీర్లో మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉంటుంది.ఆరోగ్యం బావుంటుంది.


గమనిక:  ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.