ICC Champions Trophy 2005 Ind Vs NZ Final Updates: భారత్ సాధించింది. కివీస్ పై ప్రతీకార విజయం సాధించింది. అలాగే వరుసగా రెండో ఐసీసీ ఫైన‌ల్లో విజేత‌గా నిలిచింది. 2024 టీ20 ప్రపంచకప్ ను గతేడాది గెలిచిన భారత్.. 9 నెలల్లోనే మరో ఐసీసీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ టైటిల్ ను కైవ‌సం చేసుకుంది. టైటిల్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగిన భార‌త్ స్థాయికి తగ్గ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించి, ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. తొలుత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (76)తో మంచి స్టార్ట్ అందిస్తే, త‌ర్వాతి బ్యాట‌ర్లు దాన్ని కొనసాగించి, భార‌త్ ని చాంపియ‌న్ గా నిలిపారు. దుబాయ్ లో ఆదివారం జ‌రిగిన మెగాటోర్నీ ఫైన‌ల్లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 251 ప‌రుగులు చేసింది. డారైల్ మిషెల్ (63) స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో ఆక‌ట్టుకున్నాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌ను 49  ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 254 పరుగులు చేసింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (48) ఉప‌యుక్త ఇన్నింగ్స్ ఆడాడు. బౌల‌ర్ల‌లో మిషెల్ శాంట్న‌ర్, మైకేల్ బ్రాస్ వెల్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో భార‌త్ రికార్డు స్థాయిలో ఈ టోర్నీని మూడోసారి కైవ‌సం చేసుకుని స‌త్తా చాటింది. 2002, 2013లో విజేత‌గా నిలిచిన భార‌త్.. ఈసారి కూడా విన్న‌ర్ గా నిలిచింది. అలాగే 2000లో ఇదే టోర్నీ ఫైనల్లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి ఘనంగా బదులు తీర్చుకుంది. 


Read Also: Rohit Sharma Super Innings: రోహిత్ ఒకే ఒక్క‌డు.. కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆక‌ట్టుకున్న హిట్ మ్యాన్.. న్యూజిలాండ్ తో ఫైన‌ల్..