Ind Vs NZ Final Live Updates; భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. కీలక మ్యాచ్ లో జూలు విదిల్చాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (83బంతుల్లో 76, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తో సత్తా చాటాడు. ముఖ్యంగా ఎంతో టెన్షన్ నెలకొన్న ఫైనల్ మ్యాచ్ లో పరిస్థితులుకు తగినట్లుగా బ్యాటింగ్ చేశాడు. ఇరు జట్లలో ముఖ్యమైన తేడా ఏంటంటే.. రోహిత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యం అవతలి టీమ్ లో మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్ తక్కువైనప్పుడు ఎలా ఆడాలో రోహిత్ అలా ఆడి చూపించాడు. ఒత్తిడిలో ఉన్న ప్రత్యర్థి బౌలింగ్ లైనప్ పై ఆరంభంలోనే ఎదురుదాడికి వాళ్లను ఆత్మ రక్షణలో పడేశాడు. దీంతో మరో ఓపెనర్ శుభమాన్ గిల్ (31)తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. అటు వైపు గిల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే, ఇటు రోహిత్ మాత్రం అమోఘమైన బ్యాటింగ్ చేశాడు. లీగ్ దశతోపాటు సెమీస్ లోనూ త్వరగా ఔటై కాస్త నిరాశపర్చినా, ఫైనల్లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాడు. తనలోని సిసలైన బ్యాటర్లకు మేటి కెప్టెన్ ను జోడించి, పరుగులు అలవోకగా సాధించాడు.
41 బంతుల్లోనే ఫిఫ్టీ..
ఇక ఈ మ్యాచ్ లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో రోహిత్ ను పూర్తి చేసుకున్నాడు. తను సాధించిన ఫిఫ్టీలో 38 పరుగులు బౌండరీల రూపంలోనే రావడం విశేషం. తనను ఎందుకు హిట్ మ్యాన్ అంటారోనని రోహిత్ మరోసారి నిరూపించాడు. ఇక ఇన్నింగ్స్ ఆరంభంలోనే తను జట్టుకు మరోసారి ఫ్లయింగ్ స్టార్ట్ కల్పించాడు. జెమీసన్ వేసిన ఇన్నింగ్స్ రెండో బంతినే సిక్సర్ గా బాదిన రోహిత్.. ఆ తరవాత ఓవర్లో రెండు ఫోర్లు బాది ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నిలిపాడు. ఆ తర్వాతి ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో తన ట్రేడ్ మార్కు సిక్సర్ తో జోష్ నింపాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ ను బిల్డ్ చేస్తూ సినీయర్ బ్యాటర్ కు హోదాకు న్యాయం చేశాడు.
విరాట్ కోహ్లీ కీలక మైన ఫైనల్ మ్యాచ్ లో త్వరగా ఔటయ్యాడు. కేవలం రెండు బంతులాడిన కోహ్లీ బ్రేస్ వెల్ కు చిక్కాడు. ఎల్బీడబ్ల్యూ అయి రెండో వికెట్ రూపంలో జట్టు స్కోరు 106 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
సెల్ఫ్ లెస్ రోహిత్..
106 పరుగుల వద్ద ఒకేసారి రెండు వికెట్లు గిల్ (31) , కోహ్లీ (1) త్వరగా ఔటవడంతోపాటు శ్రేయస్ అయ్యర్ కూడా బంతులు బాగా వేస్ట్ చేస్తుండటంతో రోహిత్ ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాడు. దీంతో 7 ఓవర్లలో రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అనసవర షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. రచిన్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. సెంచరీకి చేరువైన తరుణంలో సెల్ఫ్ లెస్ గా ఆడి స్టంపౌట్ అయ్యాడని విశ్లేషకులు కొనియాడుతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా తన సెల్ఫ్ లెస్ గానే ఆడుతున్నాడు. ఎన్నోసార్లు సెంచరీ, ఫిప్టీల ముందు భారీ షాట్లకు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆదివారం మ్యాచ్ లో ఇది మరోసారి నిరూపితమైంది. మొత్తానికి కీలకమైన ఐసీసీ టోర్నీలో ఒక కెప్టెన్ ఎలా ఆడాలో రోహిత్ మరోసారి రుచి చూపించాడని విశ్లేషకులు కొనియాడుతున్నారు.