2021 అక్టోబరు 3 ఆదివారం రాశిఫలాలు
మేషం
ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా అవుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. స్నేహితుల మాటలు బాధ కలిగించవచ్చు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. శుభవార్త వింటారు.  మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.పెద్ద బాధ్యతను నెరవేర్చగలరు. విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి.  పని ప్రదేశంలో శుభవార్తలు ఉంటాయి. సోమరితనం వదిలిపెట్టండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
వృషభం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది.  పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదం ఉండొచ్చు. ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.  కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు ఉండవచ్చు.  జాగ్రత్తగా ఖర్చు చేయండి.  కొత్త పనుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. యువతకు కెరీర్ సంబంధిత సమాచారం లభిస్తుంది. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు.
మిథునం
ఈ వ్యక్తులు ఈరోజు శుభవార్త వింటారు.  పిల్లల వైపు నుంచి  సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.  జీవిత భాగస్వామితో కలసి మతపరమైన పర్యటనకు వెళతారు. తెలియని అడ్డంకి మీ పనిని ప్రభావితం చేస్తుంది.  వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. బంధువుల మాటలు బాధ కలిగించవచ్చు. యోగా , వ్యాయామం చేయండి.
కర్కాటకం
కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. గృహోపకరణాలను సేకరిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వివాదంలో తలదూర్చకండి. పెద్దల అభిమానాన్ని  పొందుతారు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కార్యాలయంలో వివాదం ఉండొచ్చు.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గాయపడే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడేమందు ఆలోచించండి.  అసభ్య పదాలను ఉపయోగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం
మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొత్త బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. బంధువుతో వివాదానికి అవకాశం ఉంది. పెద్దల సలహాలను పాటించండి.  ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.  మీ వ్యాపారం బాగా జరుగుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
కన్య
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు.  మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పని పూర్తవుతుంది.  స్నేహితులను కలుస్తారు. మీ నుంచి రుణం తీసుకోవడానికి ఎవరైనా రావొచ్చు. ఈరోజు కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్యం ప్రభావితం కావొచ్చు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపార ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవవచ్చు. 
తుల
బంధువులను కలుస్తారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది.  ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త బాధ్యత వహిస్తారు. లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. పిల్లలతో సమయం గడపండి. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు.  చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. వృద్ధుల ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి.  వివాదంలో చిక్కుకోకండి.
వృశ్చికం
ఈరోజు ఎలాంటి సమస్య ఉండదు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి.  బంధువులను కలుస్తారు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. యువత పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కలహాలు ఉండొచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన తొలగిపోతుంది. యువతకు కెరీర్ సంబంధిత సమాచారం లభిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. 
ధనుస్సు
మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు ఉండొచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల ఆందోళనలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వేరేవారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు తొందరపాటు వద్దు. 
మకరం
డబ్బుకు సంబంధించిన పని పూర్తవుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఎదుటివారికి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి.  కోపం తగ్గించుకోవాలి.  ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు.
కుంభం
భగవంతుడిని పూజించడంపై ఆసక్తి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. చేపట్టిన పని సులువుగా పూర్తవుతుంది. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి.  రుణాలు ఇవ్వడం మానుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు స్నేహితుల నుంచి శుభవార్తలు పొందవచ్చు. విద్యార్థుల సమస్య పరిష్కారమవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చు చేయవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 
మీనం
మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ఓ ప్రధాన సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  వ్యాపారం బాగా సాగుతుంది.  ఈ రోజు విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. యువత కెరీర్ అభివృద్ధి చెందుతుంది. తెలియని వ్యక్తుల ముందు ప్రైవేట్ చర్చలు జరపొద్దు. రిస్క్ తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు దిశగా అడుగుపడుతుంది. 


Also Read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..


Also Read:భరణంగా రూ.200 కోట్లు.. రిజెక్ట్ చేసిన సమంత..


Also Read: అక్కినేని ఫ్యామిలీ.. బ్రేకప్ స్టోరీలకు కేరాఫ్ అడ్రెస్


Also read: విడిపోయిన చైతు-సమంత.. రియాక్ట్ అయిన నాగార్జున..


Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి