అక్కినేని ఫ్యామిలీలో ఉన్నన్ని బ్రేకప్ స్టోరీలు ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఫ్యామిలీలో లేవనుకుంటా.. ముందు నాగార్జునతో మొదలుపెడితే 1984లో దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్నేళ్లకే వీరిమధ్య మనస్పర్ధలు చోటుచేసుకోవడంతో 1990లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటికే నాగార్జున.. అమలతో ప్రేమలో ఉన్నాడని అంటారు. విడాకులు తీసుకున్న రెండేళ్లకు 1992లో అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. 


Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !


నాగార్జున కొడుకుల విషయంలో కూడా ఇలానే జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొన్ని నెలలుగా చైతు-సమంత విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. దానిపై తాజాగా ఈ జంట క్లారిటీ ఇచ్చింది. 'మేమిద్దరం విడిపోతున్నాం' అంటూ చైతు-సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ విషయం తెరపైకి వచ్చింది. అక్కినేని నాగార్జున-అమల దంపతుల కుమారుడు అఖిల్ పెళ్లి పెటాకులు కావడంపై చర్చ జరుగుతోంది. 


ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే సంస్థల యజమాని మనవరాలు శ్రేయాభూపాల్ తో అఖిల్ వివాహ నిశ్చయమైన విషయాన్ని  గుర్తుచేసుకుంటున్నారు. ఇటలీలో పెళ్లి చేసుకుందామనుకున్న ఈ జంట మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో పెళ్లి వరకు వెళ్లకుండానే తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇప్పుడు చైతు-సమంత కూడా తమ బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. తమ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని చైతు-సామ్ మీడియాను రిక్వెస్ట్ చేశారు. 


ఇదిలా ఉండగా.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన నటుడు సుమంత్ పెళ్లి ప్రయాణం కూడా విఫలమైన సంగతి తెలిసిందే. 'తొలిప్రేమ' ఫేమ్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ కొన్నాళ్లకే ఆమెతో విడిపోయారు. ఆ తరువాత కీర్తి  మరోవ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. కానీ సుమంత్ మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు.    


Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..


Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..


Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్


Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు


Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి