Horoscope Today 9th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
ఈ రాశి ఉద్యోగులు బిజీబిజీగా ఉంటారు. శుభవార్త వింటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. వ్యాపారవేత్తలు అభివృద్ధి ప్రణాళికలు అమలుచేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారికి మంచి సమయం
వృషభం
ఈరోజు కొత్త పనుల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా బావుంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
మిథునం
ఈ రోజు మీరు స్నేహితుడితో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురవుతున్న ఇబ్బందులు తీరిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.
Also Read: మీపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, ఉంటే ఏం చేయాలి!
కర్కాటకం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులు ఆహ్లాదకరంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
సింహం
ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు తమ చదువులో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తారు. కార్యాలయ వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు.
కన్య
ఈ రోజు మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రణాళికలు, మీ వైఖరిలో మార్పు ఉండవచ్చు. మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది.
తుల
మీ తల్లి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. పిల్లల ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు శుభవార్త వింటారు
వృశ్చికం
ఈ రోజు మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపార పనులపై విదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఆనందం పెరుగుతుంది.
Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!
ధనుస్సు
ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడకండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనేక మూలాల నుంచి మీకు డబ్బు వస్తుంది. మీ ప్రవర్తన ఒక్కోసారి అదుపు తప్పుతుంది.
మకరం
ఈ రోజు మీరు తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉండడం చాలా ముఖ్యం. సంఘర్షణను నివారించండి. ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. విద్యార్థులు విజయం సాధిస్తారు.
కుంభం
ఈ రోజు మీరు తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీ స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మీనం
ఈ రోజు మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం మద్దతు లభిస్తుంది.