Horoscope Today 06th november 2023 (దిన ఫలాలు నవంబర్ 06, 2023)


మేష రాశి
ఈ రోజు ఎవరితోనూ అనవసర ఘర్షణ పడొద్దు. గొడవల వలన మీరే చాలా అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సోమరితనం వీడొద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారస్తులకు ప్రభుత్వ అధికారితో వాగ్వాదం ఉండవచ్చు, అలాంటి పరిస్థితి తలెత్తితే వారు కూల్‌గా ఉండడమే మంచిది. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. సుందరకాండ పారాయణ చేయండి మీకు ప్రశాంతంగా ఉంటుంది .


వృషభ రాశి
ఈ రోజు మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి లేదంటే మిమ్మల్ని మోసం చేసేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవడంతో సంతోషంగా ఉంటారు. మీ పనికి తగిన గౌరవం లభిస్తుంది. అధికారిక పనిలో మార్పులు ఉండొద్దు. అధికారిత పనిలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభిస్తాయి. మీ పనికి తగిన గౌరవం లభిస్తుంది. ప్రాణాయామం చేయడానికి సమయం కేటాయించాలి. కుటుంబంలో వ్యక్తులతో సమయం కేటాయించండి. 


మిథున రాశి
ఈ రోజు పని విషయంలో నియమాల ఉల్లంఘన వద్దు. కార్యాలయానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంపై ఆశక్తి ఉన్న వారు ఆ దిశగా అడుగులువేసేందుకు శుభసమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.    ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.


Also Read: దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!


కర్కాటక రాశి
ఈ రాశివారు అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద  క్లయింట్‌లతో వివాదాలను నివారించాలి. ఆహార వ్యాపారం చేసే వారికి లాభిస్తుంది.  ఇల్లు అమ్మడం లేదా కొనడం వంటి ఏదైనా పని పెండింగ్‌లో ఉంటే, ఈ సమయంలో పూర్తి చేయాలి, మీరు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త


సింహ రాశి
ఎప్పటి నుంచో  నిలిచిపోయిన పనిని పునఃప్రారంభించడంలోఈ రోజు మీరు విజయం సాధిస్తారు. ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్య , ప్రభుత్వ శాఖలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామితో సరైన సమన్వయాన్ని కొనసాగిస్తూ, ఇద్దరి మధ్య ఏమీ దాచకూడదని కూడా గుర్తుంచుకోండి. 


కన్యా రాశి
ఈ రోజు మీరు సానుకూలంగా ఉండాలి..మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు పెంచుకోవాలి. సహోద్యోగులు, సహచరుల తీరు మీకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రారంభానికి ఆర్థిక అవరోధాలు ఉండొచ్చు...భగవంతుడి దయతో మీ పనుల త్వరగా పూర్తవుతాయి.   ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టుపై దృష్టి సారిస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబం భద్రత గురించి మనస్సులో తెలియని భయం ఏర్పడవచ్చు.


Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!


తులా రాశి
ఇతరుల పట్ల మీ వినయ స్వభావం సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కూల్ మైండ్‌తో ఆలోచించండి. ఎలక్ట్రానిక్ దుకాణాలు ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు సమయం కేటాయించాలి.


వృశ్చిక రాశి
ఈ రోజు మీ మనసులో ఎవరిపైనా కోపం పెరగనివ్వండి. గతంలో చేసిన తప్పులకు ఎవరైనా క్షమించమని అడిగితే వారిని నిరాశపరచవద్దు. బాస్‌తో సంబంధాలను బలంగా ఉంచుకోండి. మీ యజమాని మీపై కోపంగా ఉన్నా కానీ మీరు తగ్గి మాట్లాడడం మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది. నిన్నటి వరకూ క్షీణించిన ఆరోగ్యం ఇవాల్టి నుంచి మెరుగుపడుతుంది. 


ధనుస్సు రాశి
ఈ రోజు మీరు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. శంకరుడిని ఆరాధించేవారు పనిలో ఎదురైన అడ్డంకుల నుంచి విముక్తి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపారం, ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహారపు అలవాట్లు కొంత మార్చకోవాలి. కుటుంబంలో ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.


Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!


మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు తమ పరిచయాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఉత్సాహంగా ఉండాలి. ఉద్యోగులు సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వ్యాపారులు పోటీదారులను ఎదుర్కొంటూ దూసుకెళ్లే ప్రణాళితలు వేసుకోవాల్సిన సమయం ఇదే. ఉన్నత విద్యకోసం ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు మరికొంత కాలం నిరాశ తప్పదు.


కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారి గ్రహస్థితి శుభప్రదంగా ఉంది. కార్యాలయంలో పనిభారం ఉంటుంది కానీ ఉత్సాహంగా పూర్తిచేసేస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ అవసరం. రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. పనిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు అందరితో సున్నితంగా మాట్లాడండి. అహంకారం ప్రదర్శించవద్దు. అవసరమైవారికి సహాయం చేయడానికి ఆలోచించవద్దు. ఉద్యోగుల నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. హార్ట్ వేర్ వ్యాపారం చేసేవారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పెద్ద డీల్ చేసేటప్పుడు జాగ్రత్త. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబానికి సమయం కేటాయించాలి. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!