Horoscope Today 23rd January 2024 - జనవరి 23 రాశిఫలాలు
మేష రాశి (Aries Horoscope Today)
ఈ రాశివారి జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది, కానీ పనిలో సవాళ్లు పెరుగుతాయి. ఓపిక లేకపోవడం ఉంటుంది. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దినచర్య అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంట్లో వాదనలకు దూరంగా ఉండండి.
వృషభ రాశి (Taurus Horoscope Today)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వస్తుసౌఖ్యం, సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు పెరుగుతాయి. కోపా తగ్గించుకుంటే మంచిది. కుటుంబంలో వచ్చే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోండి. మీ మాటను అదుపులో పెట్టుకోండి, ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు
Also Read: రాముడికి కలువ పూలతో మోదీ పూజ - ఈ పూలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
మిథున రాశి (Gemini Horoscope Today)
విద్యా, మేధోపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మాటలో కర్కశత్వం తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపిస్తుంది..ఏదో చికాకుగా ఉంటారు. అధిక కోపాన్ని నివారించండి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఈరోజు కష్టపడి, అంకితభావంతో చేసే పని ఆహ్లాదకరమైన ఫలితాలనిస్తుంది
కర్కాటక రాశి (Cancer Horoscope Today)
ఆశ, నిస్పృహలు ఉంటాయి. విద్యార్థులకు చదువులో చిన్న చిన్న సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ప్రయాణం ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మాటలో మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
Also Read: శ్రీరామచంద్రుడికి సూర్య తిలకం - దర్శనభాగ్యం ఎప్పుడంటే!
సింహ రాశి (Leo Horoscope Today)
వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించాలి. ఖర్చులను నియంత్రించాలి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారం విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మాటలో సౌమ్యత ఉంటుంది, కానీ తెలియని భయం వల్ల మనస్సు కలత చెందుతుంది. సంభాషణలో సమతుల్యతతో ఉండండి అనవసరమైన వాదనలను నివారించడానికి ప్రయత్నించండి.
కన్యా రాశి (Virgo Horoscope Today)
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యా లేదా మేధోపరమైన పని కొత్త ఆదాయ మార్గాలకు మార్గం సుగమం చేస్తుంది. వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది, కానీ మీరు కచ్చితంగా వృత్తిపరమైన విజయాన్ని పొందుతారు. కుటుంబ సమస్యల వల్ల మనస్సు కొద్దిగా ఆందోళన చెందుతుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుని సహాయంతో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. మీ బంధంలో అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి.
Also Read: అయోధ్యలో రామ భక్తులకు ఇచ్చే ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా!
తులా రాశి (Libra Horoscope Today)
వృత్తి జీవితంలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంబంధాలలో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు అదనపు పని బాధ్యతలను పొందుతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today)
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో పురోగతికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ధన ప్రవాహం పెరుగుతుంది కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఆశ నిరాశ భావాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు రచన , మేధోపరమైన పని ద్వారా ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
Also Read: రామ జన్మభూమిలో 2 వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్, ఇందులో నిజమెంత?
ధనుస్సు రాశి (Sagittarius Horoscope Today)
మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతికి బంగారు అవకాశాలు ఉంటాయి. బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. న్యాయపరమైన విషయాలలో విజయం ఉంటుంది.
మకర రాశి (Capricorn Horoscope Today)
కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసేందుకు ఈ రోజు మంచి రోజు. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. సవాళ్లకు భయపడొద్దు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది.
కుంభ రాశి (Aquarius Horoscope Today)
కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు విద్యా పనిలో మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. సంపదలు, సంతోషాలు పెరుగుతాయి. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరు
గుతుంది. కుటుంబ సమేతంగా ఏదైనా ధార్మిక ప్రదేశానికి వెళ్లవచ్చు.
Also Read: పరస్త్రీ నీడ కూడా సోకనివ్వక పోవడం అంటే ఇదే - అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు!
మీన రాశి (Pisces Horoscope Today)
ఏదో విషయంలో బాధపడతారు. కాస్త సహనంగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఖర్చులు ఉంటాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిత్రుల సహకారంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకుంటారు.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.