Ayodha Ram Mandir Inauguration Updates: వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా, శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. అడుగుతో ప్రత్యేకత ఉన్న అయోధ్య ఆలయంలో..గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ  ఏర్పాటు చేశారు. 


Also Read: వైభవంగా ముగిసిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ, మందిరంలో కొలువు దీరిన బాల రాముడు


6 నిముషాల పాటూ సూర్య తిలకం
శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక టెక్నాలజీని సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ రూపొందించింది. దాని కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ సహాయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసి ఇచ్చింది. సూర్యుడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను  ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలను అమర్చారు. ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సీబీఆర్‌ఐ స్పష్టం చేసింది.


Also Read: అయోధ్యలో రామ భక్తులకు ఇచ్చే ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా!


ఈ శ్రీరామనవమికి సాధ్యం కాదు
ఏటా శ్రీరామనవమికి అన్నారు కదా అని..ఈ శ్రీరామనవమికి శ్రీరాముడి నుదిటిన సూర్యతిలకం చూడొచ్చు అనుకుంటే నిరాశపడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి ఆలయం పూర్తిగా నిర్మాణం జరగలేదు. మొత్తం మూడు అంతస్థులు పూర్తి అయిన తర్వాతే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సూర్య కిరణాలు మూడో అంతస్తుపై నుంచి పడాల్సి ఉన్నందున.. ఆలయ నిర్మాణం 3 అంతస్థులు పూర్తైన తర్వాతే దీన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తి కాగా.. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంటే రెండేళ్లతర్వాత మాత్రమే శ్రీరాముడి నుదిటిన సూర్యతిలకం దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగనుంది. 


Also Read: అయోధ్యలో అతిపెద్ద దీపం 'దశరథ్ దీప్‌' ఎప్పుడు వెలిగిస్తారంటే!


500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఉద్విగ్నంగా నిరీక్షించిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ప్రధాని మోదీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. 


Also Read: 'రామ' ఈ రెండు అక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్!