మే 22 రాశిఫలాలు


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఈ రోజు ఈ రాశివారు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మాట్లాడుకునేవి కూడా వాదనగా మారొచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటంబ సభ్యులకు సమయం కేటాయించండి. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరి సలహాలు వినడం హానికరం.


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)


ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఆర్థిక ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆనందం కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)


ఈ రాశివారికి అనారోగ్య కారణాల వల్ల అశాంతి ఉంటుంది. మాటలు, ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో వివాదాలు ఉండవచ్చు. కొంత గందరగోళం కారణంగా అపార్థం ఏర్పడవచ్చు. వాహనం జాగ్రత్తగా నడపాలి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. భగవంతునిపై భక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుంది.


Also Read: ఈ వస్తువులు మీ చేతిలోంచి జారిపడితే అశుభం


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఏదైనా పెద్ద ఆందోళన నుంచి విముక్తి పొందుతారు. స్త్రీ స్నేహితుల నుంచి లాభపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది, ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వివాహం పట్ల ఆసక్తి ఉన్న వారికి లగ్న యోగం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రశాంతతను అనుభవిస్తారు.  ప్రయాణం మీ ఆనందాన్ని పెంచుతుంది. పిల్లల వల్ల ప్రయోజనం ఉంటుంది.


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)


తలపెట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. కార్యాలయంలో లేదా ఇంట్లో బాధ్యత భారం పెరుగుతుంది. జీవితాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారు. కొత్త సంబంధాలు లేదా పనిని ఏర్పరచుకోవడంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. తండ్రితో విభేదాలు వస్తాయి. శుభకార్యాలను నిర్వహించేందుకు సమయం మంచిది కాదు.


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


శరీరం అలసటగా అనిపిస్తుంది. ఏదో బద్ధకంగా అనిపిస్తుంది. పిల్లలతో విభేదాలుంటాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాదోపవాదాలు జరుగుతాయి. రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మతపరమైన పనులు లేదా మతపరమైన ప్రయాణాల వెనుక డబ్బు ఖర్చు చేస్తారు. తోడబుట్టినవారినుంచి లాభం పొందే అవకాశం ఉంది. 


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  మీ చెడు ప్రవర్తన కారణంగా వివాదాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. శత్రువులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. ధనలాభం ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవాలి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో లాభాలు ఉంటాయి.


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. స్నేహితులు, బంధువులను కలుస్తారు. ఎక్కడికైనా సరదాగా వెళ్లేందుకు  ప్లాన్ చేసుకుంటారు.  ఆదాయ వనరులు పెరుగుతాయి. బ్రహ్మచారులకు వివాహ యోగం ఉంది. ప్రాపంచిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


ఈ రాశి ఉద్యోగులకు శుభదినం. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు, ఉద్యోగులు ప్రమోషన్ అందుకుంటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రణాళికలు వేసినా ఫెయిల్ అవుతారు. స్నేహితులను కలుస్తారు. 


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీరు మీ పని ప్రాంతంలో విజయం సాధిస్తారు. మీలో సృజనాత్మకతని వెలికి తీయండి. ప్రేమికులు పరస్పర సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. స్పెక్యులేషన్ వ్యాపారులు లాభపడతారు. పిల్లల ఆందోళన దూరమవుతుంది. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది.


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)


కొంత కాలంగా మానసిక అశాంతి ఉంటుంది. ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది. స్త్రీలు సౌందర్య సాధనాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. ప్రవర్తనలో మొండితనం ఉంటుంది. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు.


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థిక స్థితి బావుంటుంది. కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతారు. కళలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయం గడపుతారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.