Horoscope Today July 24, 2023


మేష రాశి


వ్యాపారం విస్తరించాలి అనుకునేవారికి ఈ రోజు మంచి రోజు. గతంలో పెట్టుబడి పెట్టిన పథకాల నుంచి ఈరోజు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది. వైవాహిక బంధం బావుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది.


వృషభ రాశి


వృషభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేస్తే సక్సెస్ అవుతారు. ప్లాన్ లేకుండా ఏ పనీ చేయవద్దు. ఓపికగా ఉండండి. ఉద్యోగులు తమ పనిపట్ల శ్రద్ధగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞువ సలహాలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునేవారికి ఇంకొంతకాలం ఇబ్బందులు తప్పవు.


మిథున రాశి


మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది సద్వినియోగం చేసుకోండి.  ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. పెద్దలపట్ల గౌరవంగా ఉండండి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. వాహనం  కొనుగోలు చేయాలనే  మీ ఆశ నెరవేరుతుంది.


Also Read: ఆత్మలింగంపై వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రం - ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం!
 
కర్కాటక రాశి


అనుకున్న పనులు అనుకున్న సమయం కన్నా ఆలస్యం అవుతాయి. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. శుభకార్యాలకోసం ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


సింహ రాశి


భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ధనలాభం ఉంటుంది. కొత్త ఇల్లు లేదా దుకాణం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు. ఈ రోజు మీ ప్రయాణం విజయవంతమవుతుంది.


కన్యా రాశి


ఈ రోజు మీకు అనుకూలమైన సమయం కాదు, పెట్టుబడులకు దూరంగా ఉండండి. పని విషయంలో ఓపికగా ఉండండి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ మనస్సు శుభకార్యాల్లో నిమగ్నమై ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి మంచి అవకాశాలున్నాయి. 


తులా రాశి


అనుకున్న పనులు తక్కువ సమయంలోనే పూర్తవుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఏది ముఖ్యమో ముందు ఆపనులు పూర్తిచేయండి. విజయానికి చేరువలో ఉంటారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. తప్పనిసరి అయితేకానీ ప్రయాణం చేయవద్దు. ప్రమాదం సూచనలున్నాయి జాగ్రత్త. 


వృశ్చిక రాశి


వృశ్చిక రాశి వారికి సోమవారం సమయం అనుకూలంగా లేదు, అప్రమత్తంగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించడంలో జాప్యం ఉంటుంది. మీ ఆశలు నెరవేరుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి.


Also Read: జూలై 23 నుంచి 29 వారఫలాలు: ఈ వారం ఈ రాశులవారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి


ధనుస్సు రాశి


ఈరోజు ధనుస్సు రాశి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, స్నేహితులతో కలిసి కొత్త పనిని ప్రారంభించగలరు. ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. అనుకున్న పని నెరవేరుతుంది. అనవసరంగా అబద్ధాలు చెప్పకండి...భవిష్యత్ లో ఇబ్బందుల్లో పడతారు.


మకర రాశి


ఆత్మీయుల మాటతీరు మిమ్మల్ని బాధపెడుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఇది శుభసమయం. పై స్థాయి నాయకుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. సామాజిక సంబంధాల వల్ల ప్రయోజనం పొందుతారు. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు.


కుంభ రాశి


ఈ రాశివారికి ఈ రోజు బిజీబిజీగా ప్రారంభమవుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేసేందుకు బిజీబిజీగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రంతాల నుంచి సందేశం అందుతుంది. 


మీన రాశి


ఈ రాశివారు ధనలాభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది. వ్యాపారులు చేసుకున్న భాగస్వామ్య ఒప్పందాలు సఫలం అవుతాయి.స్నేహితలు నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి.