Horoscope 2 September 2022: ఈ రోజు కర్కాటక రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశికి చెందిన వ్యాపారులు జాగ్రత్తపడాలి. ఇక కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక, వైవాహిక జీవితం పరంగా ఏ రాశివారికి ఎలా ఉందో చూద్దాం...
మేషరాశి
మేషరాశివారు ఈ రోజు శుభవార్త వింటారు. ఉద్యోగులకు సీనియర్స్ మద్దతు లభిస్తుంది. అధికారుల సహకారంతో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి..పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. మీ ప్లాన్ లో పెద్దగా మార్పులు అవసరం లేదు..అనుకున్న ప్రకారం పనులు పూర్తిచేయండి.
వృషభ రాశి
ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు మంచిరోజు. విద్యార్థులకు చదువులపై ఆసక్తి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం బాగాసాగుతుంది.
మిథున రాశి
మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఇదే మంచి సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా టార్గెట్ రీచ్ అవుతారు. విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది.
Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!
కర్కాటక రాశి
మీ లైఫ్ లోకి కొత్త స్నేహితులు వస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. రోజంతా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి రోజు.
కన్యారాశి
ఈ రోజు వ్యాపారులకు గతంలో కన్నా లాభాలు పెరుగుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కోపం తగ్గించుకోండి. ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టండి.
తులా రాశి
ఈ రోజు తులారాశి వారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి..లేదంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబం పట్ల మీ బాధ్యతలను విస్మరించవద్దు. కార్యాలయంలో పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.సమాజంలో గౌరవం పెరుగుతుంది.
Also Read: వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!
వృశ్చిక రాశి
వ్యాపారులు అతి విశ్వాసంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సోమరితనం వీడాలి..పనిపై శ్రద్ధ పెట్టాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే ఉద్యోగులు, విద్యార్థులకు ఇదే మంచి సమయం.
ధనుస్సు రాశి
ఉద్యోగులుకు ఓ సమస్యకు సంబంధించి పరిష్కారం లభిస్తుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏదో విషయంపై అనవసర భయం ఉంటుంది. విద్యార్థులకు చదువుపరంగా ఎదురైన చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి అత్తమామల వైపు నుంచి కొంత మేలు జరుగుతుంది. బంధువులకు మీతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు గతంలో కన్నా లాభాలొస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
కుంభ రాశి
మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి గౌరవం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మీన రాశి
ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం ఉంది. పని. మీ మాటలతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు. మీ మాటే మీకు గౌరవాన్ని పెంచుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.