Horoscope Today 1st October 2022: నవరాత్రుల ఆరో రోజు ఈ 5 రాశుల సంపద పెరుగుతుంది, అక్టోబరు 1 రాశిఫలాలు

Horoscope Today 1st October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Continues below advertisement

Horoscope Today 1st October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

Continues below advertisement

మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. మీకు వాహనప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి..తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయాలి. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారులకు పెద్దగా లాభాలుండలు. ఉద్యోగుల పరిస్థితిలో మార్పులుండలు.

వృషభ రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ప్రయత్నం సఫలమవుతుంది. పాత విషయాలను కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా చర్చించండి.

మిథున రాశి
తలపెట్టన పనులన్నీ మనోధైర్యంతో పూర్తిచేస్తారు.నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారంలో కొత్త పథకాల ప్రయోజనం పొందుతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు రోజు అనుకూలంగా ఉంటుంది.

Also Read: మంగళప్రదమైన దేవత మహా లక్ష్మీ, ఆరవ రోజు అమ్మవారి రూపం ఇదే!

కర్కాటక రాశి
మీ ఆరోగ్యం బాగుంటుంది. సోమరితనానికి దూరంగా ఉండండి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు మరింత చురుకుగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. సామాజిక స్థాయిలో మీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తారు.

సింహ రాశి 
కుటుంబంలో పరిస్థితులు మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. ఉద్యోగులు పనిపై ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ప్రేమ జీవితం నిరాడంబరంగా ఉండండి. దుర్గాదేవిని పూజించండి.

కన్యా రాశి
మిత్రులతో కలిసి మెలిసి ఉండేందుకు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.

తులా రాశి
ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ పనిని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి
ఈరోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ మనస్సు లోంచి ప్రతికూల ఆలోచనలను తొలగించండి. వ్యక్తిగత సంబంధాలు బావుంటాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారు వాదనలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. డబ్బును పెట్టుబడిగా పెట్టేటప్పుడు ఆలోచించండి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్త వింటారు. 

Also Read: బతుకమ్మని శివలింగం ఆకారంలో ఎందుకు పేరుస్తారు!

మకర రాశి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వినాయకుడిని ఆరాధించడం మంచిది. 

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారి ప్రయాణం విజయవంతమవుతుంది. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంటి మరమ్మతు ఖర్చులు పెరగవచ్చు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎవరి నుంచి అయినా బహుమతి పొందుతారు.

మీన రాశి
మీ మనస్సులో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. అవివాహితులకు పెళ్లికుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికందుతుంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola