Numerology prediction 1 October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 1 శనివారం రోజు ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు కార్యాలయంలో కొంతమంది సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంతో సమయం గడపేందుకు ప్రయత్నించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. పనులు సులభంగా పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
సమయాన్ని ఆస్వాదించగలరు. కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉంటాయి. మీరు జీవితంలో కొత్త శక్తిని పొందుతారు. ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. ఆలోచనలను సానుకూలంగా ఉంచండి.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో పుట్టినవారికి అదృష్టం మీతోనే ఉంటుంది. కొందరు అనుకోని సక్సెస్ అందుకుంటారు. పరియచాలు పెంచుకునేందుకు ప్రయత్నించండి. మీరు తోబుట్టువుల నుంచి మద్దతు పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇదే అనుకూల సమయం. మీ ప్రియమైన వారితో సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇంకొంత కాలం ఆగాలి
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఇంట్లో ప్రశాంతంత, సంతోషం ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు తమ పనితీరుతో సీనియర్లను మెప్పిస్తారు. మతపరమైన పనుల పట్ల ఆసక్తి కనపరుస్తారు.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
పనులు వాయిదా వేయకండి..అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఏదైనా అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో సామరస్యం ఉంటుంది. ఆదాయం , ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది.
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ రోజు పనిలో మరింత బిజీగా ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలు విజయవంతమవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రణాళిక లేకుండా ఏ పనీ చేయకపోవడమే మంచిది.
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
మీ తీరుతో ఇంటా బయటా గౌరవమర్యాదలు పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. ఈ రోజు వ్యాపారులకు శుభదినం. విద్యార్థులకు మంచిరోజు. ఉద్యోగులు పనితీరుకి ప్రశంసలు పొందుతారు.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ప్రేమను కనపరుస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించిన సమాచారం వింటారు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి సమయానికి సరైన సలహా పొందుతారు.