Tiruvannamalai: తమిళనాడులో ఉన్న ప్రధాన క్షేత్రాల్లో ఒకటి అరుణాచలం. నిత్యం భక్తులతో కళకళలాడే తిరువణ్ణామలై పౌర్ణమి రోజుల్లో మరింత రద్దీగా ఉంటుంది. గిరిప్రదక్షిణలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అరుణాచలం వెళుతుంటారు. ఇందుకోసం RTC తో పాటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజ్ లు ప్రకటిస్తుంటాయి. అయితే హైదరాబాద్ టు అరుణాచలం ఏ మార్గంలో వెళ్లడం మంచిది. ఏది సౌకర్యం, ఏది తక్కువ ఖర్చుతో అయిపోతుంది.. పూర్తి వివరాలు ఇవే...
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలి అనుకుంటే వివిధ మార్గాలున్నాయి.
Hyderabad to Tiruvannamalai By Air
ప్రయాణ సమయం తక్కువగా ఉండాలంటే విమానంలో వెళ్లడం మంచిది. అరుణాచలంలో విమానాశ్రయం లేదు కానీ సమీపంలో చెన్నై , బెంగళూరులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్ జర్నీ 1 గంట 20 నిమిషాలు. టికెట్ ధర 2 వేలు నుంచి 7 వేలు ఉంటుంది..మీకు బుక్ చేసుకున్న టైమ్ ఆధారంగా. హైదరాబాద్ - చెన్నై మధ్య తిరిగే విమానాలు... ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ చెన్నై నుంచి తిరువణ్ణామలై కి రోడ్డు ద్వారా వెళితే 195 కిలోమీటర్లు నాలుగైదు గంటల్లో చేరుకోవచ్చు. టాక్సీల్లో వెళితే ఓవైపు ఛార్జీలు 3 వేల నుంచి 5 వేలు ఉంటాయి. చెన్నై నుంచి తిరువణ్ణామలైకి రైలు ప్రయాణం 4 గంటలు పడుతుందిఇక బెంగళూరు నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గంలో వెళితే నాలుగైదు గంటలు సయమం పడుతుంది. ట్యాక్సీల ధర 3 వేల నుంచి 6 వేలు ఉంటుంది. బెంగళూరు నుంచి బస్సులు కూడా ఉంటాయి. విమాన మార్గంలో వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి వెళ్లడం కన్నా చెన్నై మీదుగా వెళ్లడం మంచిది
Hyderabad to Tiruvannamalai By Train ఖర్చు తక్కువ, సౌకర్యం ఎక్కువ కోరుకునేవారు హైదరాబాద్ నుంచి అరుణా చలం ట్రైన్లో వెళ్లడం బెటర్. హైదరాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ కి చేరుకునేందుకు సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లేందుకు రెండు మూడు గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో చెన్నై లేదా బెంగళూరు చేరుకున్నా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరుణాచలం చేరుకోవచ్చు. బెస్ట్ ట్రైన్ రూట్ అంటే మాత్రం... హైదరాబాద్ నుంచి కాట్పాడి చేరుకుని తిరువణ్ణామలై వెళ్లడమే బెటర్.
Hyderabad to Tiruvannamalai By Bus
హైదరాబాద్ నుంచి తిరువణ్ణామలై వెళ్లే భక్తులకు ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయినే నేరుగా అరుణాచలం వెళ్లొచ్చు లేదంటే బ్రేక్ జర్నీ చేయొచ్చు. ఈ రెండు ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయ్. నాన్ ఎసీ, ఎసీ, స్లీపర్, సెమీ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరులో ఉన్న క్షేత్రాలు కవర్ చేస్తూ అరుణాచలం చేరుకోవచ్చు. 10 నుంచి 12 గంటలు పట్టే ఈ ప్రయాణానికి టికెట్ ధర 1200 నుంచి 2500. చెన్నై లేదా బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్లాలి అనుకుంటే నాలుగైదు గంటల సమయం పడుతుంది.. బస్ టికెట్ ధర 300 నుంచి 600
Hyderabad to Tiruvannamalai Long Road Trip
ఈ మూడు కాకుండా లాంగ్ ట్రిప్ వేయాలని ప్లాన్ చేసుకుంటే... హైదరాబాద్ నుంచి అరుణాచలం దాదాపు 705 కిలోమీటర్లు. హైదరాబాద్ లో బయలుదేరి కర్నూలు, కడప, చిత్తూరు మీదుగా తిరువణ్ణామలై వెళ్లేందుకు 12 నుంచు 14 గంటల సమయం పడుతుంది. పెట్రోలుకి అయ్యే ఖర్చు సుమారుగా 5 వేల నుంచి 7 వేలు...
మీరు కేటాయించే సమయం, బడ్జెట్ ఆధారంగా మీ మార్గాన్ని ఎంపిక చేసుకోండి