మీకు మార్గమధ్యలో పాము కనిపిస్తే అది దేనికి సంకేతమో తెలుసా?
పాము కలలో కనిపించే విధానం జరగబోవు విషయాలకు చాలా సంకేతాలను ఇస్తుంది. అయితే శ్రావణమాసంలో పాములు ఇంట్లో కానీ, బయట కానీ కనిపిస్తే అది శుభ సంకేతమా- అశుభ సంకేతమా?
తెల్లటి పామును చూడటం అరుదు కానీ శ్రావణ మాసంలో తెల్లటి పాము కనిపిస్తే అపారమైన ధన వర్షం కురుస్తుందని సూచన
శ్రావణ మాసంలో చనిపోయిన పామును చూస్తే అది అశుభంగా పరిగణిస్తారు. మీరు ప్రస్తుతం తప్పు పనిలో మునిగిపోయారు, తప్పుడు మార్గంలో ఉన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వందసార్లు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో నష్టం జరగవచ్చని సూచన అది.
శ్రావణ మాసంలో పాము మీ మార్గంలో ఎదురుగా వస్తే అది శుభంగా పరిగణిస్తారు. మీరు ఏ పని కోసం వెళుతున్నారో, అందులో విజయం సాధిస్తారని దీని అర్థం.
శ్రావణ మాసంలో నల్లని పాము శివలింగానికి చుట్టుకుని కనిపిస్తే అది చాలా శుభం. దీని అర్థం శివుని కృప మీపై ఉంది, త్వరలో కోరికలన్నీ నెరవేరుతాయి అని అర్థం
శ్రావణ మాసంలో పాముల పూజ కోసం నాగ పంచమి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాముల పూజ లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం నాగ పంచమి జూలై 29 న జరుపుకుంటారు.