Horoscope Today 18th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచిరోజు. జరిగినదానిగురించి ఆలోచించవద్దు. మీలో చిన్న చిన్న విషయాలు మార్చుకుంటే ఉత్తములుగా కనిపిస్తారు...అవి మీ సక్సెస్ కి కూడా కారణం అవుతాయి. 


వృషభ రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ మనసు చెప్పినట్టు వినండి..మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోండి. పనిపట్ల శ్రద్ధ పెట్టి చేస్తే సక్సెస్ అందుకుంటారు. మీ ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


మిథున రాశి
ఈ రాశివారికి ఇతరుల మనస్సు చదివే సామర్థ్యం ఉంటుంది.మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ తెలివితేటలతో అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి కూడా బయటపడగలుగుతారు. మనస్సులో గందరగోళానికి చోటివ్వకండి. కుటుంబం నుంచి సహకారం అందుతుంది.


Also Read: అక్టోబరు 16 న మిథునంలోకి కుజుడు, ఈ రాశులవారికి నెలరోజుల పాటు కష్టాలు తప్పవు!


కర్కాటక రాశి 
ఈ రోజు మీకు బాధ్యతలు పెరుగుతాయి. జీవితంలో కొంత సంఘర్షణ ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి తగిన ఫలితం అందుకుంటారు. మీ ఇంటి విషయంలో బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండరాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మధ్యాహ్న సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


సింహ రాశి
సింహరాశి వారు తమ లక్ష్యం వైపు ఆత్మవిశ్వాసంతో వేగంగా కదులుతారు. కానీ కొన్నిసార్లు అవి కూడా దారితప్పుతాయి. ఈ రోజు మీరు ఒత్తిడికి గురవుతారు, ఆందోళన చెందుతారు. మీ భావాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఏ విషయంలోనూ త్వరగా ప్రతిస్పందించవద్దు. సమస్యలు వస్తాయి మరియు పోతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 


కన్యా రాశి
కన్యారాశి వారు  ఎప్పుడూ ఉత్సాహంగా  ఉంటారు. మాటతీరుతో ఆకట్టుకోవడంతో పాటూ డబ్బును సేకరించడంపై ఆసక్తి కలిగి ఉంటారు. వీరి జీవితాల్లో తరచూ ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ స్నేహితులు లేదా మీ కుటుంబానికి చెందిన ఎవరికైనా మీ సహాయం అవసరం అవుతుంది. మీ మాటకు గౌరవం ఉంటుంది, మిమ్మల్ని విశ్వసించేవారు- మీ సలహాలు పాటించేవారు ఎక్కువే ఉంటారు. 


తులా రాశి
ఈ రాశివారు వివాదాలు పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు.  అదేవిధంగా న్యాయం గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల మీ ధోరణి చాలా మంచి ఫలితాలనిస్తుంది. అనుకున్న పనులు పూర్తవడంతో రిలాక్స్ గా ఉంటారు. 


వృశ్చిక రాశి 
ఈ రాశివారికి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల మక్కువ ఉంటుంది. స్వభావరీత్యా చాలా కాలిక్యులేటివ్ గా ఉంటారు. ఈ రోజు మీరు అనుకోని కొన్ని సంఘటనలు తలెత్తుతాయి..అలాంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు జాగ్రత్తగా ఉండాలి. అయితే అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 


Also Read:  రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!


ధనుస్సు రాశి
ఈ రాశివారి స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, విశాల హృదయులు. మీ కృషికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. గౌరవం, గుర్తింపు, డబ్బు పొందుతారు. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ఇదే సరైన సమయం. ప్రస్తుతం మీకున్న జీవితంతో సంతృప్తి చెందితే మరింత సంతోషంగా ఉంటారు. ఖర్చులు తగ్గంచండి..అహంకారం దరిచేరనివ్వకండి. 


మకర రాశి
అకస్మాత్తుగా పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఇది మీకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ఈ రోజు విద్యార్థులకు కష్టమైన రోజు కావొచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఏదైనా అడ్డంకి వస్తే, దానిని తెలివిగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. 


కుంభ రాశి
ఈ రోజు పరిస్థితి మీకు అనుకూలంగా కనిపించడం లేదు. ఈ ఆందోళన సమయాల్లో సన్నిహితుల నుంచి మీరు సహకారం పొందుతారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం అనే ఆలోచనతో ముందుకు సాగితే సక్సెస్ అవుతారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోపోవడం మంచిది.


మీన రాశి 
గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తుచేసుకుని ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఇది మీ లక్ష్యాలను సరైన దారిలో పెట్టేందుకు సహకరిస్తుంది. పగటి కలలు కనొద్దు. అంతో ఇంతో అదృష్టం మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.