Mars Transit 2022: భూమి పుత్రుడైన కుజుడి ప్రభావం చాలా తీక్షణంగా ఉంటుంది. గొడవలకు ప్రేరేపిస్తాడు. శరీరంలో మలినాలు, విషాలు తొలగింపచేస్తాడు. కుజ గ్రహ ప్రభావం ముఖ్యంగా మహిళలపై ఎక్కువగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు, కామాన్ని వ్యసనాలను ప్రేరేపిస్తాడు. అదే రాహువుతో కలసి ఉంటే ఇంకా అరాచకంగా ఉంటుంది. రవితో కలసి ఉంటే మొత్తం శుభఫలితాలనే ఇస్తాడు. కుజుడి సంచారం బావుంటే నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు, ఉన్నత ఉద్యోగం పొందుతారు,ఆర్థిక పరిస్థితి అనుకోనంతగా మెరుగుపడుతుంది. అయితే అక్టోబరు 16న కుజుడు వృషభ రాశినుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబరు 30 అదే రాశిలో తిరోగమనం చెంది మళ్లీ నవంబరు 13న వృషభంలోకి వక్రంగా ప్రయాణించనున్నాడు. ఈ నెల రోజుల పాటూ కొన్ని రాశులకు అన్నీ శుభఫలితాలే ఉన్నాయి..ఆ రాశులేంటో చూద్దాం....


మేష రాశి
అంగారకుడి ఈ సంచారం మీ మూడవ ఇంట్లో ఉంటుంది. ఈ కాలంలో, మీరు చాలా ఓపికగా మరియు ధైర్యంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురైన సమస్యలన్నీ తొలగిపోతాయి. పని పట్ల మీ అంకితభావం కారణంగా కార్యాలయంలో సీనియర్లు మిమ్మల్ని ఎంతో అభినందిస్తారు. అయితే ఈ సమయంలో మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేదంటే వాదనల వల్ల మీ మానసిక ఒత్తిడి పెరిగి దీర్ఘకాలంలో నష్టం తప్పదు.


Also Read: అక్టోబరు 16 న మిథునంలోకి కుజుడు, ఈ రాశులవారికి నెలరోజుల పాటు కష్టాలు తప్పవు!


సింహ రాశి
అంగారకుడి ఈ సంచారం మీకు పందకొండో ఇంట ఉంది. మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించిన దానికన్నా అధిక లాభాలు వస్తాయి. పనిపై శ్రద్ధ పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి లాభాలొస్తాయి. కోర్టుకేైసులేమైనా ఉంటే పరిష్కారం అవుతాయి.


కన్యా రాశి
మిథునంలో కుజుడి సంచారం మీ కెరీర్లో అనుకూల ఫలితాలు పొందేలా చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.  వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచిసమయం. పరిస్థితులన్నీ మీకు అనూకూలంగా ఉంటాయి. ఉపాధి లేదా వ్యాపారానికి సంబంధించిన మీ బాధ్యతలను బాగా నిర్వర్తిస్తారు.


Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!


ధనస్సు రాశి
వృషభం నుంచి మిథున రాశిలో అంగారకుడి సంచారం వల్ల ధనస్సు రాశివారికి మంగళకర ఫలితాలున్నాయి. కుటుంబంలో శుభకార్యం నిర్వహిస్తారు లేదా హాజరవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.


మకర రాశి
రాశిమారుతున్న కుజుడు మకరరాశివారికి మంచి ఫలితాలు ఇస్తాడు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ స్ఫూర్తి కారణంగా, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. 


కుంభ రాశి
కుంభరాశివారికి కూడా అనుకూల ఫలితాలున్నాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. స్నేహితులతో కలసి సంతోష సమయం గడుపుతారు. భాగస్వామ్యంతో కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం.