Mars Transit in Gemini 16 October 2022: గ్రహాలు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాయి. కొన్ని సార్లు అదే రాశిలో వక్రం లేదా తిరోగమనం చెందుతాయి. అయితే ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలుంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా కొందరికి ఆరోగ్యంపై మరికొందరికి ఉద్యోగంపై ఇంకొందరికి సంసార బంధాలపై ఉంటాయి. అయితే అక్టోబరు 16న కుజుడు వృషభ రాశినుంచి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబరు 30 అదే రాశిలో తిరోగమనం చెంది మళ్లీ నవంబరు 13న వృషభంలోకి వక్రంగా ప్రయాణించనున్నాడు. ఈ సంచారం రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది...ఆ రాశులేంటో చూద్దాం..
వృషభ రాశి
కుజుడి సంచారం వృషభరాశివారికి కూడా ప్రతికూల ప్రభావాలనే ఇవ్వనుంది. ఈ నెల రోజుల పాటూ ఏ పని తలపెట్టినా సరిగా పూర్తిచేయలేరు. కుటుంబంలో వివాదాలుంటాయి. దూరప్రాంతం ప్రయాణం చేయాలి అనుకున్నవారు మాత్రం వెళ్లగలుగుతారు. ప్రేమికులకు ఇబ్బందులు తప్పవు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది.
Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!
మిథునరాశి
ఇదే రాశిలో కుజుడు సంచరిస్తున్నందున వీరికి అనారోగ్య సమస్యలు తప్పవు. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న సమస్యని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నూతన పనులు ఆరంభించవద్దు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. కోపం పెరుగుతుంది...వైవాహిక జీవితంలో సామరస్యం లోపిస్తుంది. ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్టైతే ఇది సరైన సమయం కాదు.
కర్కాటక రాశి
మిథునంలో కుజుడి సంచారం కర్కాటక రాశివారికి కూడా పెద్దగా కలసిరాదు. ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తప్పవు. ఇంటి నిర్మాణం లేదా మరమ్మత్తు కోసం అదనపు ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సరిపడా నిద్రలేక ఇబ్బంది పడతారు.
తులా రాశి
కుజుడి సంచారం మీకు ఆరోగ్యం, ఆర్థిక సమస్యలుంటాయి. ఉద్యోగులకు, కార్మికులకు అకాస్మాత్తుగా బదిలీలు ఉండొచ్చు. ఉద్యోగం మారాలి అనే ఆలోచన అంత మంచిది కాదు. సోదరులు, సోదరీమణులతో చిన్న చిన్న చికాకులుంటాయి. ప్రతికూల ఆలోచనలు మీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అహంకారం కారణంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. న్యాయపరమైన చిక్కుల్లో పడతారు.
వృశ్చిక రాశి
మిథునంలో కుజుడి సంచారం వృశ్చిక రాశివారికి చిన్న చిన్న అడ్డంకులు తప్పవు. డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పెద్దగా సహకారం ఉండదు. వాహనం జాగ్రత్తగా నడపాలి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. మీలో టెన్షన్ చికాకు పెరుగుతుంది.
Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!
మీనరాశి
మీన రాశి వారికి ఆస్తులు తీసుకునేందుకు సమయం సరిపోదు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది. ఇది వారికి అననుకూల సమయం. సుఖాలు తగ్గడంతో ఒత్తిడి పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.