Karthika Deepam October 14th Episode 1483 (కార్తీకదీపం అక్టోబరు 14 ఎపిసోడ్)


వారణాసిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన కార్తీక్..తనకి ఎలా ఉందని అడుగుతాడు. ప్రాణాపాయం లేకపోయినా కోమాలోకి వెళ్లే అవకాశాలున్నాయని డాక్టర్ చెబుతారు. ఆ తర్వాత కార్తీక్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచీ దీప వేసిన కార్తీకదీపం నాటకం వరుకూ జరిగినవి గుర్తుచేసుకుంటాడు. 
కార్తీక్: దీపకు నాకు ఒకేసారి యాక్సిడెంట్ అయింది మరి నేను ఈ మోనిక చేతికి ఎలా చిక్కానో ఒకవేళ దీప దగ్గరే ఉంటుంటే గతం మర్చిపోయిన కనీసం దీప భర్తగా ఉండేవాడ్ని కదా..దీనికంతటకీ కారణం నువ్వే మోనితా..నిన్ను మాత్రం క్షమించను అనుకుంటాడు
దీప: అమ్మ అన్నయ్యలతో కూర్చుని కార్తీక్ రాలేదని ఏడుస్తుంది. ఆ మోనిత అన్నంతపని చేసింది డాక్టర్ బాబుని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంక డాక్టర్ బాబు నా దగ్గరికి రారు ఆ మాయలాడి ఏమైనా చేస్తుంది..మూడుముళ్ల బంధంతో పాటూ మోనిత అనే చిక్కుముడిని కూడా ఇచ్చాడు దేవుడు. 
అన్నయ్య: తను ఎక్కడికి తీసుకెళ్లినా..నీ జీవితం లోంచి ఎక్కడికీ తీసుకెళ్లలేదు..
దీప: అప్పటి పరిస్థితి వేరు..కానీ ఇప్పుడు వేరు.. డాక్టర్ బాబు ముందు చులకన చేసి నన్ను ఒక చెడ్డదానిలా నిరూపించాలనుంది. కానీ ఎప్పుడైతే దుర్గ వచ్చాడో దానికి ఏం చేయాలో తెలియని స్థితిలో అయోమయంగా ఉంది. దానిపై అనుమానం పెరిగిపోతుందని భయంతో బాబుని నా దగ్గర నుంచి దూరం చేసింది..
దుర్గ: మోనిత కూడా టెన్షన్ పడుతోంది..డాక్టర్ బాబు కనిపించడం లేదని
దీప: అదంతా నాటకం అమ్మా..
దుర్గ: సిన్సియర్ గానే ఎడుస్తున్నట్టుంది..కార్తీక్ సార్ అక్కడే ఎక్కడో తప్పిపోయినట్టున్నారు. నేను సంగారెడ్డి వెళతాను కార్తీక్ సార్ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను..
డాక్టర్ అమ్మ: ఇదంతా మంచికే అనిపిస్తోంది..పుట్టినరోజున నీతో ఉండకుండా చేయాలనుకుంది..దానికి కూడా ఆ అవకాశం లేకుండా చేసేందుకు దేవుడు తప్పిపోయేలా చేశాడు
దీప: వదిలి వెళ్లిపోతే పర్వాలేదు..ఎక్కడైనా దాచితేనే ఇబ్బంది
డాక్టర్ అమ్మ: దాచడానికి వస్తువా...డాక్టర్ బాబు క్షేమంగా వస్తాడు చూడు..


Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!


అటు మోనిత కూడా కార్తీక్ కోసం నిజంగానే ఏడుస్తుంటుంది. పదేళ్లుగా నిన్ను ప్రేమించింది, నీ ప్రాణాలు కాపాడింది నిన్ను దూరం చేసుకోవడానికా.. వంటలక్క మాటలు నమ్మావా..దుర్గ చెప్పింది విని నాపై అనుమానంతో వెళ్లిపోయావా అని ఏడుస్తుంది. బొటిక్ లో పనిచేయే ఓ అమ్మాయి ఓదార్చేందుకు వెళతాను అంటే..మరో అమ్మాయి చేయిపట్టి వెనక్కు ఆపుతుంది. అదంతా నాటకమో, నిజమో అనవసరంగా డిస్టబ్ చేస్తే చెంప పగలగొడుతుందంటుంది. ఇంతకీ సార్ ఎందుకు వెళ్లిపోయారు, దుర్గ సార్ కి మేడంకి మధ్య ఏమైనా ఉందేమో అని మాట్లాడుకుంటారు...


దీప సీరియస్ గా వంట చేస్తుంటుంది..డాక్టర్ అన్నయ్య అయోమయంలో చూస్తుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దుర్గ మనం అనుకున్నది నిజమే దీపమ్మ...డాక్టర్ బాబు సంగారెడ్డిలో తప్పిపోయారంట మోనిత నిజంగానే ఏడుస్తోంది అక్కడకు వెళ్లి వెతికి తీసుకొచ్చేస్తానంటాడు. దీప మాత్రం ఏం వంటలు చేయాలని అడుగుతూ ఉంటుంది... ఏమైందమ్మా నీకు అని అన్నయ్య అడగడంతో..ఒక్కసారిగా ఏడ్చేస్తుంది.. డాక్టర్ బాబు నాకు కావాలి ఆయన లేకుండా నేను బతకలేను అంటుంది.
దుర్గ: కార్తీక్ సార్ నిజంగానే అక్కడే ఎక్కడో తప్పిపోయారు వెళ్లి వెతుకుతా
దీప: ఆయన్ను చూసేవరకూ నాకు మనశ్సాంతి ఉండదు వెళదాం పద అంటూ దీప గబగబా బయటకు వచ్చి చెప్పులేసుకుని రెండు అడుగులు వేయగానే కార్తీక్ అక్కడుంటాడు... డాక్టర్ బాబూ తలకు ఆ కట్టేంటి..మీరు క్షేమంగానే ఉన్నారు కదా.. 
కార్తీక్: ఏదో చిన్న దెబ్బ తగిలింది.. ఎవరో ఎవరిపైకో రాయివిసిరితే అనుకోకుండా నాకు తగిలింది..
దీప: పాపం ఇన్నాళ్లూ నాకోసం ఎంత ఆరాట పడ్డావ్..నేను గుర్తుపట్టలేక మోనిత మాటలు వింటూ నిన్ను ఎంతో బాధపడ్డాను.. నాకు అంతా గుర్తొచ్చిందని ఇప్పుడే చెప్పి నిన్ను దగ్గరకు తీసుకోవాలి ఉంది దీపా అనుకుంటాడు. కానీ ఇప్పుడు చెప్పను..నాకు గతం గుర్తొచ్చిందని చెబితే మోనిత వల్ల నీకు ప్రమాదం ఉంటుంది.. ముందు ఆ మోనిత సంగతి చెప్పాక నీకు నిజం చెబుతాను..
దీప: అసలేమైపోయారు డాక్టర్ బాబు
మోనిత వచ్చిందా అని కార్తీక్ అడిగితే..రాత్రే నాతోపాటూ వచ్చేసింది అంటాడు దుర్గ.. సరే నేను ఇంటికి వెళతాను నువ్వు కూడా వస్తావా వంటలక్కా అని అడుగుతాడు కార్తీక్..


Also Read: అందరి ముందూ రిషి చేయిపట్టుకుని తీసుకెళ్లిన వసు, మరో స్కెచ్ వేసిన దేవయాని!


అటు శౌర్య..తను మోనితపైకి విసిరిన రాయి ఎవరికి తగిలిందో..ఎంత  బాధపడుతున్నారో అనుకుంటుంది. మోనితకి ఎందుకంత కోపం వచ్చింది..నేను ఇక్కడ ఉండడం వల్ల ఆవిడకు వచ్చిన నష్టం ఏంటి.. నిజంగా అమ్మా నాన్నలు బతికే ఉన్నారా..ఈ సంగతి మోనితకు తెలుసా..నాకు ఏమీ అర్థం కావడం లేదు.. ఏం చేయాలి, ఎలాతెలుసుకోవాలి అనుకుంటుంది..


మరోవైపు దీప.. కార్తీక్ ని ఇంటి దగ్గర దింపుతుంది. మరోవైపు మోనిత పోలీసులకు కాల్ చేసి కార్తీక్ గురించి ఎంక్వరీ చేస్తుంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ మోనిత చేతిలో ఫోన్ తీసుకుని వచ్చాను అవసరం లేదంటాడు. ఈ లోగా మోనిత కార్తీక్ తలకు కట్టు చూసి దీపపై ఫైర్ అవుతుంది..ఏం చేశావ్ అని నిలదీస్తుంది...
కార్తీక్: దెబ్బ ఎలా తగిలింది అని అడిగావ్..చెప్పేవరకూ ఆగాలి కదా..నీకు నేను వచ్చానన్న ఆనందం కన్నా వంటలక్కపై కోపమే ఎక్కుఉంది..
వంటలక్కా నువ్వు జాగ్రత్తగా ఉండు వెళ్లు అని చెబుతాడు..
మోనిత: ఆ వంటలక్కపై ఎందుకంత జాలి చూపిస్తున్నావ్
కార్తీక్: తలకు దెబ్బ తగిలి వస్తే ఏమైందని అడగకుండా వంటలక్కపై ఫైర్ అవుతావేంటి .నేను చెప్పాను కదా నీకు నాకన్నా మిగిలా వాళ్ళందరూ ఎక్కువే నా గురించి తప్ప అందరూ గురించి ఆలోచిస్తావు 
అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి మోనిత, నీ హ్యాండ్ బ్యాగ్ నిన్న రాత్రి నా దగ్గర వదిలేసావు అని అంటాడు.  కార్తీక్, రాత్రిపూట తన హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని దుర్గని అడుగుతాడు. దానికి దుర్గ, నిన్న రాత్రి మేమిద్దరం కలిసి సంగారెడ్డి నుంచి వచ్చాం అనడంతో అబద్ధం అని అరుస్తుంది మోనిత. 
ఎపిసోడ్ ముగిసింది...


రేపటి(శనివారం) ఎపిసోడ్ లో
రాత్రి దీపను లేపేయడానికి మనుషుల్ని పెట్టావ్ పనిజరగలేదు.. అందుకే కదా చిరాకుగా ఉన్నావ్ అంటాడు దుర్గ. కవర్ చేసుకునేందుకు మోనిత ప్రయత్నించడంతో..దీపను చంపితే మనకొచ్చే లాభం ఏంటి..కార్తీక్ ను అడ్డుతొలగించుకోవాలి అనుకున్నావా అంటాడు... ఆ మాటలు మెట్లపైనుంచి దిగుతూ కార్తీక్, బయట నిల్చున్న దీప ఇద్దరూ వింటారు...