16th January 2023 Horoscope Today:  కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
ఈ రోజు మీ సంపాదన బావుంటుంది. పాత స్నేహితలను కలుస్తారు. సరదా కోసం,సంపాదన కోసం ఇతరుల్ని తప్పుదారి పట్టించవద్దు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. కోర్టు పనులు అనుకూలిస్తాయి. ఖర్చుల విషయంలో కొంత ఆలోచించండి. 


వృషభ రాశి 
పాజిటివ్ ఆలోచనలు మాత్రమే మనసులోకి రానివ్వండి. ఏదైనా కొనడానికి ముందు..ఇప్పటికే మీ వద్ద ఉన్న వస్తువులను పూర్తిగా వినియోగించండి. చిన్న పిల్లలతో సరదా సమయం గడుపుతారు. ప్రేమ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.


మిథున రాశి
ఈరోజు మీకు మంచి రోజు . కార్యాలయంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పనిలో స్నేహితుల సహాయం తీసుకుంటారు. కొత్త విజయావకాశాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. 


Also Read: మీ బంధుమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు కొటేషన్స్


కర్కాటక రాశి 
ఈ రోజు ఆవులకు ఆహారం తినిపించండి...మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ప్రేమ బంధంలో మాధుర్యం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


సింహ రాశి
బయటి క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎప్పటినుంచో చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది. ఇంట్లో చిన్న చిన్న మార్పులుంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 


కన్యా రాశి
ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. లావాదేవీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.  ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ప్రవర్తనకు అంతా ఫిదా అవుతారు.


తులా రాశి 
ఈ రోజు మీరు కొత్త పనులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితంలో ఏదైనా మార్పు చేయాలి అనుకుంటే తక్షణం మార్చుకోవడం మంచిది. ప్రజాజీవితంలో ఉండే వారు సన్మానాలు పొందుతారు. 


వృశ్చిక రాశి
మిత్రులతో విభేదాల కారణంగా సహనం కోల్పోతారు. అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.


Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!


ధనుస్సు రాశి 
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ పనులన్నీ మీ మనసుకు అనుగుణంగా పూర్తవుతాయి. సంతానంతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఇంజనీరింగ్ చేస్తున్న ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు శుభదినం.


మకర రాశి 
ఈ రాశి ఉద్యోగులు మీ పనితీరుని మార్చుకోవడం ద్వారా కార్యాలయంలో ప్రమోషన్ పొందుతారు. మీ కొత్త ఆలోచనలకు ప్రశంసలు అందుతాయి.మీ జీవిత భాగస్వామితో కలిసి సమయం గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది.


కుంభ రాశి 
పనికిరాని ఆలోచనలతో మీ శక్తిని వృథా చేసుకోవద్దు.అదనపు ఆదాయం కోసం మీ సృజనాత్మక ఆలోచనలను ఆశ్రయిస్తారు. ఓ రహస్య సమాచారాన్ని మీ జీవిత భాగస్వామితో పంచుకునేముందు ఆలోచించండి. 


మీన రాశి 
ఈ రోజు మీకు ప్రయోజనకరమైన రోజు. ఏ పెద్ద పని అయినా పిల్లల సహాయంతో పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళతారు. ఓ శుభవార్త వింటారు.