Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. సహోద్యోగుల ప్రవర్తన కారణంగా ఇబ్బందిపడతారు. పనులను ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హానిచేయాలనే ఆలోచన వద్దు..
వృషభ రాశి
కుటుంబ సభ్యులతో వివాద సూచనలున్నాయి. అనవసర కోపాన్ని ప్రదర్శించవద్దు. విద్యార్థులు చదువు విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దూర ప్రాంతం ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు.
మిథున రాశి
ఈ రోజు మీ ప్రభావం పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. కొన్ని ముఖ్యమైన పనులను ఆలస్యం చేస్తారు..ఫలితంగా మీరు ఆశించిన ఫలితం పొందేందుకు సమయం పట్టొచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: జూన్ 14 నుంచి నెలాఖరు వరకూ మేషం, మిథునం సహా ఈ రాశులవారికి గోల్డెన్ టైమ్!
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దూరప్రాంతాల్లో ఉన్న బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి.
సింహ రాశి
ఈ రోజంతా మీరు ఏదోబాధలో ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండండి..పరుష పదాలను వినియోగించవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీరు మౌనంగా ఉండాల్సిన దగ్గర మాట్లాడకపోవడమే మంచిది. కుటుంబానికి సమయం కేటాయించాలి..
కన్యా రాశి
ఈ రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. మీ వర్కింగ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మీ పని నాణ్యత పెరుగుతుంది. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు సమయానుకూలంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఐటి, సాఫ్ట్‌వేర్ రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీ మీ ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు..మానసిక స్థితిని మెరుగుపర్చుకోవడం మంచిది. ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటారు. మతపరమైన కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు
Also Read: కుంభ రాశిలో శని తిరోగమనం - 140 రోజుల పాటూ ఈ రాశులవారిపై శని ప్రతికూల ప్రభావం!
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల కారణంగా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. ముఖ్యమైన పనులు పూర్తిచేయడంలో ఫెయిల్ అవుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తిచేయగలరు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది
మకర రాశి
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు..చేపట్టిన పనుల్లో సరైన ఫలితాలు పొందలేరు. వైవాహిక జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. సహనం పాటించాలి...సంయమనం అవసరం. మీ రహస్య విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి.
కుంభ రాశి
ఈ రోజు మీ ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. రోజంతా బిజీగా ఉంటారు. కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు.
Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.