Saturn Retrograde Aquarius 2024:  శని దేవుడు వారి కర్మలను బట్టి వారికి మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తాడు. శని  ప్రతి కదలిక అన్ని రాశులవారిపైనా ప్రభావం చూపిస్తుంది. శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ఏడాదంతా ఇదే రాశిలో సంచరిస్తాడు. అయితే జూన్ 25 నుంచి నవంబర్ 13 వరకూ శని కుంభ రాశిలో శని వక్రదిశలో ప్రయాణించడం వల్ల..తుఫానులు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. మరీ ముఖ్యంగా మకర రాశి, కుంభ రాశి, మీన రాశులవారికి ఏల్నాటి శని నడుస్తోంది. గురు, శుక్రు గ్రహాల బలం కారణంగా ఆ రాశులవారికి పెద్దగా నష్టం ఏమీ లేకపోయినా..శని తిరోగమనం సమయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు. దాదాపు 140 రోజుల పాటూ మీ రాశులపై శని ప్రతికూల ప్రభావం ఉంటుంది...  


Also Read: మిథున రాశిలోకి సూర్యుడు - జూన్ 15 నుంచి జూలై 16 వరకూ ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే !


మేష రాశి


కుంభంలో శని రివర్స్ కదలిక మేష రాశివారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు తప్పవు... ఎన్నో ఆటంకాలు అధిగమనించి పనిని పూర్తిచేద్దామని ప్రయత్నించినా ఫలితం దక్కదు. కుటుంబంలో అనవసర వివాదాలు...భార్య భర్త మధ్య తగాదాలు ఉంటాయి. ఈ సమయంలో ఆరోగ్యాన్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 


వృషభ రాశి


శని తిరోగమనం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ రాశి నుంచి పదో స్థానంలో శని సంచారం ఉంది. అంటే రానున్న 140 రోజులు సవాళ్లతో కూడుకున్నవే అవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావడం చాలా కష్టం. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 


Also Read: మిథున సంక్రాంతి రోజు చేయాల్సిన దానాలేంటి - మూడు రోజుల వేడుకగా జరుపుకునే 'రాజా పర్బ' గురించి తెలుసా!
 
మకర రాశి


కుంభ రాశిలో శని వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్ల ఆ ప్రభావం మకరరాశివారిపై తీవ్రంగా ఉంటుంది. ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు నష్టపోతారు. నతన పెట్టుబడులు కలసిరావు. ఆరోగ్యంపై కూడా శని ప్రభావం ఉంటుంది..


కుంభ రాశి


కుంభ రాశిలోనే ఉన్న శని...ఇదే రాశిలో తిరోగమనం చెందడంతో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక బాధలు తప్పవు. ఉద్యోగులు మాటపట్టింపులకుపోకుండా జాగ్రత్తగా ఉండాలి...అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులు నూతన పెట్టుబడులు అనే ఆలోచనే చేయొద్దు...


మీన రాశి


కుంభ రాశిలో శని వ్యతిరేక దిశలో సంచారం మీన రాశివారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి...సమయానికి చేతిలో డబ్బులుండవు. అనుకోని వావాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త...


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!


ప్రతి మనిషికి జీవితకాలంలో ఎల్నాటి శని మూడుసార్లు వస్తుంది. మొదటి సారి వచ్చే ఏల్నాటి శనిని మంగుశని అని, రెండోసారి వచ్చే శనిని పొంగు శని అని..మూడోసారి వచ్చే శని మృత్యు శని అంటారు. మొదటి రెండుసార్లు వచ్చే ఏల్నాటి శని...ఆ దశలో ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా వెళ్లిపోతూ మంచి చేస్తుంది..గురు, శుక్ర గ్రహాల బలం ఉంటే శని ప్రభావం ఇంకా తక్కవు ఉంటుంది...నిత్యం దైవారాధనలో ఉండేవారిపైనా శని ప్రభాలం తక్కువ ఉంటుంది. అయితే మూడోసారి వచ్చే శని ప్రభావం తీవ్రంగా ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మూడోసారి ఎల్నాటి శని బారినపడిన వారికి మృత్యుభయం వెంటాడుతుందని చెబుతారు.  


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.