Mithun Sankranti 2024 Date : సంవత్సరానికి 12 సంక్రాంతిలు వస్తాయి..అయితే తెలుగువారు పంటచేతికందే సమయం అయిన మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటూ జరిగే ఈ వేడుకలు ఏడాదిపాటూ గుర్తుండిపోతాయి. అయితే సంక్రాంతి అనగానే ఏటా జనవరిలో వచ్చే మకర సంక్రాంతి మాత్రమే కాదు...రాశులు 12 ఉన్నాయి కదా...నెలకో రాశిలో సూర్య గమనం ఉంటుంది. ఇలా మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మేష సంక్రణం, వృషభ సంక్రమణం అని అంటారు. జూన్ 15 నుంచి భానుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు..అందుకే మిథున సంక్రమణం అయింది. 


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!


మిథున సంక్రాంతి రోజు చేయాల్సిన దానాలు


హిందువులకు అత్యంత పవిత్ర దినాల్లో సంక్రాంతి కూడా ఒకటి. మకర సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి అర్ఘ్యం ఇచ్చి దాన ధర్మాలు చేసినట్టే ప్రతి సంక్రాంతికి కూడా ఇవే పద్ధతులు పాటిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి రోజు చేసే దాన ధర్మాలు అత్యంత పుణ్య ఫలాన్నిస్తాయి. కాశీ, హరిద్వార్, రిషికేష్ వంటి పుణ్యప్రదేశాల్లో గంగాస్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తారు. గంగలో స్నానమాచరిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అది కూడా సంక్రాంతి రోజు గంగలో స్నానమాచరించి దాన ధర్మాలు చేస్తే మరుజన్మ ఉండదంటారు. మిథున సంక్రాంతి రోజు సూర్యభగవానుడి అనుగ్రహం పొందేందుకు గోధుమలు దానం చేస్తే వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. నవధాన్యాలు దానమిస్తే మీ జాతకంలో ఉండే గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని , బెల్లం దానంగా ఇస్తే కుటుంబ జీవితంలో ఎదురయ్యే కష్టాలు సమసిపోతాయిని, ఎరుపు వస్త్రాన్ని దానమిస్తే దుఃఖం దూరమవుతుందని చెబుతారు.  


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


ఒడిశాలో 4 రోజుల పండుగ 


మిథున సంక్రాంతిని ఒడిశా ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. తెలుగువారు మకర సంక్రాంతిని జరుపుకున్నట్టే అక్కడి వారు నాలుగు రోజుల పాటూ పెద్ద పండుగగా నిర్వహిస్తారు. జూన్ 14,15,16 ప్రథాన పండుగ. ఒడిశాలో మిథున సంక్రాంతిని 'రాజా పర్బ' అని పిలుస్తారు. ఈ రోజు నుంచి వ్యవసాయ సంవత్సరం ప్రారంభమైందని భావిస్తారు. అంటే రుతుపవనాల ఆగమనాన్ని పురస్కరించుకుని జరుపుకునే వేడుక ఇది. మొదటి రోజు "పహిలి రాజా" (పూర్వ రాజా), రెండోరోజు "రాజా" (సరైన రాజా)  మూడో రోజు "బసి రాజా" (గత రాజా) అని పిలుస్తారు. ఓడిశాలో జరిగే పురాతన పండుగలలో ఒకటైన  'రాజా పర్బ' ని స్త్రీత్వానికి, సంతానోత్పత్తికి ప్రత్యేకమైన రుతుస్రావానికి ప్రక్రియగా జరుపుకుంటారు. ఈ పండుగ స్త్రీలలో రుతుక్రమానికి సూచనగా భావిస్తారు. అందుకే మూడురోజుల పాటూ స్త్రీలతో ఎలాంటి పనులు చేయించరు...ఆటపాటల్లో ముగినితేలేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ మూడు రోజులు భూమిని పూజిస్తారు..పూలు - పండ్లు కోయరు, భూమిని తవ్వరు. నాలుగో రోజు ఉత్సవం ముగిసిన తర్వాత వర్షాన్ని ఆహ్వానిస్తారు. ఈ పండుగ ఆరంభంలో గిరిజిన సంప్రదాయంగా ప్రారంభమైంది ఆ తర్వాత రాజవంశానికి విస్తరించింది...అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.